సచిన్ విగ్రహం ఆ క్రికెటర్ ను పోలి ఉండడంతో అభిమానుల అసంతృప్తి..విగ్రహ రూపకర్తపై విమర్శలు..!

ముంబైలోని వాఖండే స్టేడియంలో( Wakhande Stadium in Mumbai ) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar )విగ్రహావిష్కరణ నవంబర్ ఒకటవ తేదీ జరిగిన సంగతి తెలిసిందే.అయితే చాలామంది క్రికెట్ అభిమానులు సచిన్ టెండుల్కర్ విగ్రహంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 Sachin's Statue Resembles The Cricketer, Fans Are Unhappy Criticism Of The Statu-TeluguStop.com

ఎందుకంటే సచిన్ టెండూల్కర్ విగ్రహం చూడడానికి కాస్త ఆస్ట్రేలియా( Australia ) స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ ను పోలి ఉంది.దీంతో అభిమానులు సచిన్ విగ్రహ రూపకర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Australia, Cricketer, India Sri Lanka, Tendulkar, Steve Smith, Wakhandest

సచిన్ టెండూల్కర్ కు కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సచిన్ విగ్రహాన్ని బాగా తయారు చేసి ఉంటే బాగుండేదని విగ్రహ రూపకర్తపై పలువురు కామెంట్లు చేస్తూ దూషిస్తున్నారు.అయితే ఇంకొంతమంది క్రికెట్ అభిమానులు ఏమంటున్నారంటే.సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం లేనివారు, క్రికెట్ పరిజ్ఞానం కాస్త కూడా లేనివారు స్టీవ్ స్మిత్ విగ్రహం( Steve Smith statue ) భారత్లో ఉండడం ఏంటి అంటూ కాస్త వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు.

Telugu Australia, Cricketer, India Sri Lanka, Tendulkar, Steve Smith, Wakhandest

తాజాగా భారత్-శ్రీలంక( India-Sri Lanka ) మ్యాచ్ వీక్షించిన క్రికెట్ అభిమానులు స్టేడియంలో ఉండే సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని చూసి ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండడంతో మ్యాచ్ జరిగినప్పటి నుంచి సచిన్ విగ్రహం పెద్ద చర్చనీయాంశమైంది.సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని అహ్మదాబాద్ కు చెందిన ప్రమోద్ కాంబ్లే రూపొందించారు.సచిన్ టెండూల్కర్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జైషా సచిన్ విగ్రహావిష్కరణ చేశారు.ఇక తాజాగా వాఖండే వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక జట్టుపై భారత్ 302 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్లలో వరుస విజయాలు సొంతం చేసుకున్న భారత్ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube