మీరు చూస్తున్నది నిజమే.నానికి( Nani ) అతని సినిమాల్లో నటించే హీరోయిన్స్ అంటే ఎంతో మక్కువ.
అందుకే వారికి రిపీటెడ్ గా తన సినిమాల్లో అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాడు.అందులో చాలామంది హీరోయిన్స్ అలాగే అవకాశాలు సంపాదించారు కీర్తి సురేష్, నిత్యా మీనన్, నివేదా థామస్, సాయి పల్లవి వంటి నటీమణులు కూడా అతడు సినిమాల్లో మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటారు వీరికి సినిమాలోనే కాదు బయట కూడా మంచి స్నేహం ఉంటుంది.
ఇప్పుడు ఇదే జాబితాలో మరొక హీరోయిన్ వచ్చి చేరింది ఆమె ఎవరో కాదు నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా( Gang Leader Movie ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్.
ఈ సినిమా పెద్ద తోపు విజయాన్ని అయితే దక్కించుకోలేదు కానీ ప్రియాంక( Priyanka Arul Mohan ) మాత్రం తమిళ్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంది.మొట్టమొదట కన్నడ సినిమా ఇండస్ట్రీకి డెబ్యూగా నటించిన ప్రియాంకను తెలుగులోకి తీసుకువచ్చింది నానినే ఈ సినిమా ద్వారా ఆమె సైమా అవార్డులకు( SIIMA Awards ) కూడా బెస్ట్ డెబిట్ ఫిమేల్ గా అవార్డు అందుకుంది.ఈ సినిమా తర్వాత ఎందుకు దాదాపు నాలుగేళ్ల పాటు ఎవరు ప్రియాంక ఆరుల్ మోహన్ గురించి పట్టించుకోలేదు.
దాంతో నాని మరోసారి ఆమెకు హీరోయిన్ గా తన చిత్రంలో అవకాశం ఇచ్చాడు.ప్రస్తుతం నాని నటిస్తున్న సరిపోదా శనివారం( Saripoda Sanivaram ) సినిమాలో ఆమెనే లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది.
తమిళ్ లో తానేంటో నిరూపించుకున్న తర్వాత ఆమెకు అక్కడ వరుస అవకాశాలు క్యూ కట్టాయి.కానీ తెలుగులో, కన్నడలో ఆమె గురించి అందరూ మర్చిపోతున్న టైం లో దాని మరోసారి ప్రియాంకకు అవకాశం ఇచ్చి ఆమెకు తెలుగులో లైన్ క్లియర్ చేశాడు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటిస్తున్న ఓజి సినిమాలో( OG Movie ) సైతం ప్రియాంక ఒక పాత్రలో నటిస్తుండగా నాని మరో సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా నటించబోతోంది ఇలా వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటుంది ప్రియాంక అరుల్ మోహన్.