నేడు ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.నవంబర్ 30వ తారీకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో.
తెలంగాణలో పొత్తులపై చర్చించడం జరిగింది.ఈ భేటీలో కేంద్రమంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొనడం జరిగింది.
ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు నేపథ్యంలో సీట్ల వ్యవహారం చర్చించుకున్నట్లు సమాచారం.ఆల్రెడీ అంతకుముందు పవన్ కళ్యాణ్ తో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కిషన్ రెడ్డి భేటి కావడం జరిగింది.
ఈ భేటికి ముందు తెలంగాణలో జనసేన 30కి పైగా స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు.కానీ కిషన్ రెడ్డి భేటీ అనంతరం బీజేపీతో కలసి జనసేన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.దీంతో తెలంగాణలో ఎక్కడెక్కడ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలి అనేదానిపై అమిత్ షాతో పవన్ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే మరో రెండు రోజులపాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉంటారని సమాచారం.
ఈ క్రమంలో పలువురు బీజేపీ అగ్ర నాయకులతో తెలంగాణలో సీట్ల పంపకంతో పాటు ఏపీ రాజకీయాల విషయంలో కూడా పవన్ చర్చలు జరపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.