కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వినతిపత్రం ఇచ్చారు.ఏపీ ఆర్థిక పరిస్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ఆమె విన్నవించారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, బేవరేజ్ కార్పొరేషన్ వంటి సంస్థలపైనా విచారణ సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలని పురంధేశ్వరి కోరారని తెలుస్తోంది.ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్థిక అవకతవకలు, అప్పులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానన్నారు.
రాష్ట్రం చేస్తున్న అప్పులను భవిష్యత్ లో కట్టలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.రాష్ట్రం చెల్లించాల్సిన బకాయిలను ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తేవాలని తెలిపారు.