తెలంగాణ బిజెపి అభ్యర్థుల జాబితా ఇంకెప్పుడో ? 

ఇప్పటికే తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించడంతోపాటు వారికి బీఫాంలో కూడా అందజేశారు ఇక కాంగ్రెస్ మొదటి విడత జాబితాలో 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది రెండో జాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బిజెపి ( BJP )మాత్రం ఇంకా అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తూనే ఉంది.  ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా, బిజెపి అభ్యర్థుల జాబితా విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలైనట్టుగా కనిపిస్తోంది.

 Telangana Bjp Candidate List When , Brs Mla Candidates, Brs Congress , Congr-TeluguStop.com

ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్( BRS Congress ) అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉండగా బిజెపి లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో టికెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు జనాల్లోకి వెళ్లాలా మరికొద్ది రోజులు వేచి ఉండాలని పడుతున్నారు కానీ టిఆర్ఎస్ కాంగ్రెస్( TRS Congress ) అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నడంతో తాము ఆ రేసులో వెనకబడిపోతాము అన్న భయం బిజెపి నేతలు కనిపిస్తోంది.

Telugu Bjpmla, Brs Mla Candis, Congressmla, Kishan Reddy, Telangana-Politics

 బిజెపి ( BJP )కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఎప్పుడు జరిగితే అప్పుడు లిస్టు వస్తుందని, 50 శాతం సీట్లకు అభ్యర్థులు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎప్పుడు బేటి అవుతుందనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు కొన్ని కొన్ని స్థానాలు విషయంలో క్లారిటీ ఉన్న ఎక్కువ చోట్ల పార్టీ ఎవరిని అభ్యర్థులుగా పోటీకి దించుతుందనేది తేలడం లేదు.

Telugu Bjpmla, Brs Mla Candis, Congressmla, Kishan Reddy, Telangana-Politics

 దీనికి కారణం పార్టీ సీనియర్లు చాలామంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు దీంతో వారిని బలవంతంగా ఒప్పించి టికెట్ ఇస్తారా లేక వారిని పక్కన పెట్టేస్తారని తేలాల్సి ఉంది.నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం లోకి దూసుకుపోవాల్సిందిగా పార్టీ కీలక నేతలు కూడా ఎవరికీ భరోసా ఇవ్వలేకపోతున్నారు.దీంతో పార్టీ ప్రకటించబోయే జాబితా కోసం ఆశావాహులు ఎదురుచూపులు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube