కుంకుమపువ్వును మగవాళ్ళు ఉపయోగిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

ముఖ్యంగా చెప్పాలంటే కుంకుమపువ్వు( Saffron ) అంటే గర్భిణీలు తినాలని చాలామంది చెబుతూ ఉంటారు.కానీ దాన్ని ఎవరైనా తినవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

 Health Benefits Of Saffron For Men,saffron,men,cancer,health,weight Loss,digesti-TeluguStop.com

కీళ్ల నొప్పులు తగ్గించడం, నిద్రలేమి, డిప్రెషన్, అంగస్తంభన సమస్యలకు ఇది చక్కటి ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు.అలాగే కుంకుమ పువ్వులో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

చర్మానికి మెరుపు తీసుకురావడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఎలాంటి క్రీములు ఉపయోగించకుండా సహజ సిద్ధంగా చర్మం మెరిసేలా చేస్తుంది.

Telugu Cancer, Saffron-Telugu Health

అలాగే చర్మంపై మొటిమలు( Pimples ) తగ్గించడంలోనూ కుంకుమపువ్వు ఎంతగానో సహాయపడుతుంది.దీనిలో ఫైటోకెమికల్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ మెదడుకు అవసరమైన సెరోటోనిన్ ను అందించడంలో ఎంతో ఉపయోగపడతాయి.అంతేకాకుండా రుతుక్రమ సంబంధిత సమస్యలను( Mensturation Problems ) కూడా కుంకుమపువ్వు దూరం చేస్తుంది.కుంకుమపువ్వు ఉపయోగించడం వల్ల అధిక రక్తస్రావం లాంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

అలాగే అంగస్తంభన తక్కువ ఉన్నవాళ్లు రోజు కుంకుమ పువ్వును ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.బాదం పాలలో కుంకుమపువ్వు కలిపి ఉపయోగిస్తే మగవారికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Telugu Cancer, Saffron-Telugu Health

అంతే కాకుండా క్యాన్సర్( Cancer ) కారణమైన వాటిపై ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా కాకుండా ఉండేలా చూసే యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో ఎక్కువగా ఉంటాయి.ప్రతిరోజు కుంకుమ పువ్వు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండదని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.కుంకుమపువ్వు జీవక్రియను నియంత్రిస్తుంది.కొద్దిగా తినగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది.అంతేకాకుండా దీని వల్ల బరువు( Weight Loss ) కూడా తగ్గుతారు.రాత్రి నిద్రపోయే ముందు పాలలో కుంకుమపువ్వు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది.

దీనిలో ఉండే మాంగనీస్ శరీరానికి ప్రశాంతతను కలిగించి త్వరగా నిద్ర పట్టేలా చేస్తుంది.కుంకుమ పువ్వులో క్రోసిన్ జ్వరాన్ని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

అంతేకాకుండా పాలలో కుంకుమ పువ్వు వేసుకొని తాగితే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి.కీళ్ల నొప్పులు( Knee Pains ), ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో బాగా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube