ఇజ్రాయెల్ పై ఉగ్రదాడి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ..!!

నేడు ఇజ్రాయెల్( Israel ) దేశం పై పాలస్తీనా ప్రాంతానికి చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి.కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఐదువేల రాకెట్ల దాడి చేసి.

 Pm Modi Reacts To The Terrorist Attack On Israel , Pm Modi, Israel, Israel On-TeluguStop.com

ఇజ్రాయెల్ భూభాగంలో చెలరేగిపోయాయి.హమాస్ తీవ్రవాదులు( Hamas are extremists ).ఇజ్రాయెల్ పౌరులపై సైనికులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఆరు గ్రామాలను ఆధీనంలోకి తీసుకొని.

నరమేధనం సృష్టిస్తున్నారు.ఈ ఉగ్రవాదుల దాడులలో చాలామంది సామాన్యులు చనిపోతూ ఉన్నారు.

ప్రాణాలతో దొరికిన ఇజ్రాయెల్ సైనికులను తీవ్రవాదులు.గాజా ప్రాంతంలోకి బందీలుగా తీసుకెళ్లి పోతున్నారు.

దక్షిణ ఇజ్రాయెల్ భూభాగాలలోకి భారీగా ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.ఈ క్రమంలో పౌరులు ఇళ్లల్లోనే ఉండాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆదేశాలు హెచ్చరికలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు.

కాగా ఇజ్రాయెల్ పై ఉగ్రదాడి ఘటనపై తాజాగా ప్రధాని మోదీ( Prime Minister Modi ) స్పందించారు.ఇజ్రాయెల్ లో ఉగ్రదాడులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని స్పష్టం చేశారు.

ఉగ్రదాడులలో బలైన అమాయక సామాన్య కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఇజ్రాయెల్ కి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు.

మరోపక్క హమాస్ ఉగ్రవాదులపై.ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది.

అనవసరంగా ఇజ్రాయేల్ పై దాడి చేసి.పెద్ద తప్పు చేశారని కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారని.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక ఇదే సమయంలో ఇప్పటికే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాలు హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలపై మెరుపు దాడులు చేస్తున్నారు.

ఇజ్రాయెల్ భద్రతా బలగాలు అదే విధంగా ఉగ్రవాదుల మధ్య హారాహోరీగా దాడులు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube