యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించకపోవడానికి సంబంధించి రోజుల తరబడి చర్చ జరుగుతోంది.నామమాత్రంగా అయినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి కుటుంబంలో మనస్పర్ధలు సాధారణం అని వాటిని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ స్పందించకపోవడం ఎంతవరకు రైట్ అని నెటిజన్లు ఫీలవుతున్నారు.
మరోవైపు టీడీపీ ( TDP ) అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వమని టీడీపీ అభిమాని ఎన్టీఆర్ ఫ్యాన్ తో చెప్పాడట.
అదే సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సినిమాల ఫ్యాన్ షోకు కూడా అనుమతులు రావని చెప్పాడట.అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ టీడీపీ అభిమాని కామెంట్ గురించి ఘాటుగా రియాక్ట్ కావడం జరిగింది.
అర్ధరాత్రి ఫోన్ చేసి ఒకడు కామెడీ చేశాడని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ తెలిపారు.

2024లో టీడీపీ అధికారంలోకి వస్తే తారక్ సినిమాలు( NTR Movies ) ఎలా రిలీజ్ అవుతాయో చూస్తానని చెప్పారని ఫ్యాన్స్ షో వేయనివ్వరని అన్నాడని ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్పుకొచ్చారు.మీకు నిజంగా అంత దమ్ము ఉంటే ఎన్టీఆర్ సినిమాలను ఆపి చూడాలని సినిమా షోలను ఆపిన సమయంలో చూసుకుందామని ఎన్టీఆర్ ఫ్యాన్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.ఇందుకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ట్వీట్లు కొంచెం హద్దులు దాటిన భాషలో ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్( NTR Fans ) జోలికి రావడం వల్ల ఎన్టీఆర్ కంటే టీడీపీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.2024లో టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో అయినా చంద్రబాబు( Chandrababu Naidu ) అరెస్ట్ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.







