వివిధ కార్పొరేట్ కంపెనీలకు దడ పుట్టిస్తున్న 'రిలయన్స్' సరికొత్త ఆవిష్కరణ!

అవును, దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా ఆవిష్కరణ ఆలోచన అనేది వివిధ కార్పొరేట్ కంపెనీలకు దడ పుట్టిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ( Reliance )ఎలక్ట్రిక్ వాహనాల కోసం స్వాపబుల్ బ్యాటరీల కాన్సెప్ట్‌ ను ఒకదానిని ఆవిష్కరించింది.

 'reliance' Is A New Innovation That Is Causing Palpitations To Various Corporate-TeluguStop.com

గ్రేటర్ నోయిడా వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌ పోతో పాటు నిర్వహిస్తున్న ‘ది బ్యాటరీ షో ఇండియా‘ మొదటి ఎడిషన్ సందర్భంగా ఈ ఆవిష్కరణ జరిగింది.

ఈ నేపధ్యంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ… స్వాపబుల్ బ్యాటరీల కాన్సెప్ట్‌( Swappable Battery ) ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ దశకు చేరుకుందని, వచ్చే ఏడాది కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని తెలిపారు.

Telugu Reliance, Solar, Corporate-Latest News - Telugu

ఇక ఈ బ్యాటరీలు ఒక ఛార్జ్‌ తో 70 నుంచి 75 కిమీ రేంజ్ అందించనున్నట్లు పేర్కొన్నారు.అది మాత్రమే కాకుండా బ్యాటరీలను సౌరశక్తిని ఉపయోగించి కూడా ఛార్జ్ చేసుకోవచ్చని తెలిపారు.రిలయన్స్ బ్యాటరీలను కేవలం వాహనాలకు మాత్రమే కాకుండా గృహోపకరణాలకు కూడా వాడుకోవచ్చని సంబంధిత అధికారులు ఒకరు మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

నిజానికి వాహన వినియోగదారుడు ఛార్జింగ్ అయిపోగానే బ్యాటరీ మార్చుకోవలసి వుంటుంది.కాబట్టి బ్యాటరీని ఇంట్లో లేదా ఆఫీసులో మార్చుకోవచ్చు. ఈవీ స్టేషన్స్‌లో ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని ఇచ్చేసి ఫుల్ ఛార్జ్ బ్యాటరీని పొందవచ్చని చెబుతున్నారు.

Telugu Reliance, Solar, Corporate-Latest News - Telugu

ఇంకా ఈ బ్యాటరీ మార్చుకోవడానికి కేవలం 6 సెకన్లు సమయం పడుతుందని చెప్పడంతో అక్కడికి వచ్చిన క్లైంట్స్ తమ కరతాళధ్వనులతో ఆడిటోరియాన్ని మారు మ్రోగించారు.అంతేకాకుండా రిలయన్స్ ఎనర్జీ సొల్యూషన్‌లో సోలార్ ప్యానెల్‌( Solar panel )లు, ఇన్వర్టర్, మీటర్లు, క్లౌడ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయని ఓ అధికారి తెలిపారు.అంతే కాకుండా టూ వీలర్స్ కోసం ఆటోమేటెడ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ (OE) తయారీదారులతో కలిసి పని చేస్తున్నట్లు, త్వరలోనే అనుకూలమైన మోడల్స్ వస్తాయని ఈ సందర్బంగా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube