వివిధ కార్పొరేట్ కంపెనీలకు దడ పుట్టిస్తున్న ‘రిలయన్స్’ సరికొత్త ఆవిష్కరణ!

అవును, దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా ఆవిష్కరణ ఆలోచన అనేది వివిధ కార్పొరేట్ కంపెనీలకు దడ పుట్టిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ( Reliance )ఎలక్ట్రిక్ వాహనాల కోసం స్వాపబుల్ బ్యాటరీల కాన్సెప్ట్‌ ను ఒకదానిని ఆవిష్కరించింది.

గ్రేటర్ నోయిడా వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌ పోతో పాటు నిర్వహిస్తున్న 'ది బ్యాటరీ షో ఇండియా' మొదటి ఎడిషన్ సందర్భంగా ఈ ఆవిష్కరణ జరిగింది.

ఈ నేపధ్యంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ.స్వాపబుల్ బ్యాటరీల కాన్సెప్ట్‌( Swappable Battery ) ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ దశకు చేరుకుందని, వచ్చే ఏడాది కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని తెలిపారు.

"""/" / ఇక ఈ బ్యాటరీలు ఒక ఛార్జ్‌ తో 70 నుంచి 75 కిమీ రేంజ్ అందించనున్నట్లు పేర్కొన్నారు.

అది మాత్రమే కాకుండా బ్యాటరీలను సౌరశక్తిని ఉపయోగించి కూడా ఛార్జ్ చేసుకోవచ్చని తెలిపారు.

రిలయన్స్ బ్యాటరీలను కేవలం వాహనాలకు మాత్రమే కాకుండా గృహోపకరణాలకు కూడా వాడుకోవచ్చని సంబంధిత అధికారులు ఒకరు మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

నిజానికి వాహన వినియోగదారుడు ఛార్జింగ్ అయిపోగానే బ్యాటరీ మార్చుకోవలసి వుంటుంది.కాబట్టి బ్యాటరీని ఇంట్లో లేదా ఆఫీసులో మార్చుకోవచ్చు.

ఈవీ స్టేషన్స్‌లో ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని ఇచ్చేసి ఫుల్ ఛార్జ్ బ్యాటరీని పొందవచ్చని చెబుతున్నారు.

"""/" / ఇంకా ఈ బ్యాటరీ మార్చుకోవడానికి కేవలం 6 సెకన్లు సమయం పడుతుందని చెప్పడంతో అక్కడికి వచ్చిన క్లైంట్స్ తమ కరతాళధ్వనులతో ఆడిటోరియాన్ని మారు మ్రోగించారు.

అంతేకాకుండా రిలయన్స్ ఎనర్జీ సొల్యూషన్‌లో సోలార్ ప్యానెల్‌( Solar Panel )లు, ఇన్వర్టర్, మీటర్లు, క్లౌడ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయని ఓ అధికారి తెలిపారు.

అంతే కాకుండా టూ వీలర్స్ కోసం ఆటోమేటెడ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ (OE) తయారీదారులతో కలిసి పని చేస్తున్నట్లు, త్వరలోనే అనుకూలమైన మోడల్స్ వస్తాయని ఈ సందర్బంగా వెల్లడించారు.

ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీయార్ ల కోసం ఎదురుచూస్తున్న ఇతర భాషల స్టార్ డైరెక్టర్స్..