సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన 'జాతి రత్నాలు' డైరెక్టర్..అందుకు కారణాలు ఇవే!

మన టాలీవుడ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఇద్దరు ముగ్గురు యంగ్ జనరేషన్ దర్శకులలో ఒకడు అనుదీప్.( Director Anudeep ) ‘పిట్టగోడ’ అనే చిత్రం తో రచయితగా ఇండస్ట్రీ కి పరిచయమైనా అనుదీప్ ఈ చిత్రం తర్వాత ‘జాతి రత్నాలు’( Jathi Ratnalu ) సినిమాకి దర్శకుడిగా మారి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాడు.

 Jathi Ratnalu Director Anudeep Retirement As Actor Details, Jathi Ratnalu ,direc-TeluguStop.com

అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెండేళ్ల క్రితం దాదాపుగా 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇండస్ట్రీ మొత్తం అనుదీప్ పేరు ఈ చిత్రం తో మారుమోగిపోయింది.

ఇక గత ఏడాది ప్రముఖ తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ అనే చిత్రం తీసాడు.ఈ సినిమా ఒక సెక్షన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ, ఓవరాల్ గా కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిల్చింది.

దీంతో అనుదీప్ కి చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

Telugu Anudeep Mad, Anudeep, Jathi Ratnalu, Kalyan Shankar, Mad, Raviteja, Tolly

ఇకపోతే అనుదీప్ రీసెంట్ గా ‘మ్యాడ్’( Mad Movie ) అనే చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు.ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లో కూడా మనం అనుదీప్ ని చూడొచ్చు.కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు, నటుడిగా కూడా ఈయనతో మంచి టాలెంట్ ఉంది.

ఈయన ఇంటర్వ్యూస్ చూస్తే పొట్ట చెక్కలు అవ్వకుండా ఉండదు.నాన్ స్టాప్ పంచులతో పిచ్చెక్కిస్తాడు.‘జాతి రత్నాలు’ చిత్రం లో చిన్న పాత్రలో కనిపించిన అనుదీప్, మ్యాడ్ చిత్రం లో మాత్రం పూర్తి స్థాయి రోల్ చేసాడు.ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పాల్గొన్న అనుదీప్ ని యాంకర్ సుమ మీలో మంచి కామెడీ టైమింగ్ ఉంది కదా, నటుడిగా ఇలాగే కొనసాగిపోవచ్చు కదా అని అంటుంది.

Telugu Anudeep Mad, Anudeep, Jathi Ratnalu, Kalyan Shankar, Mad, Raviteja, Tolly

అప్పుడు అనుదీప్ నటన మీద నాకు ఆసక్తి లేదు లేండి, ఇది కేవలం కళ్యాణ్ శంకర్( Kalyan Shankar ) రిక్వెస్ట్ చెయ్యడం వల్ల చెయ్యాల్సి వచ్చింది.ఇదే నా చివరి సినిమా, నటుడిగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్న అంటూ తన స్టైల్ లో వ్యంగ్యంగా మాట్లాడాడు.ఈ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇకపోతే అనుదీప్ అతి త్వరలోనే మాస్ మహారాజ రవితేజ తో( Raviteja ) ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్.

ఎంటెర్టైమెంట్ కి పవర్ హౌస్ లాంటి రవితేజ కి అనుదీప్ కూడా తోడు అయితే ప్రేక్షకుల పొట్ట చెక్కలు అవ్వాల్సిందే అని అంటున్నారు ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube