జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena chief Pawan Kalyan ) నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణాజిల్లా అవనిగడ్డలో( Avanigadda ) నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం పై సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
జగన్ అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేశారని పవన్ మండిపడ్డారు.కనీసం డీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్ కూడా తీయలేకపోయారు.మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ అండగా ఉంటాం.2018 నుంచి ఉద్యోగాలు లేవు.30 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వం భర్తీ చేయడం లేదు.చట్టసభలలో నేనుంటే ఈపాటికి ఈ పరిస్థితి నిరుద్యోగులకు రానిచ్చేవాడిని కాదు.
జగన్ తన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అవన్నీ మర్చిపోయారు.
మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు.
ఈసారి ఆ అవకాశం వైసీపీకి( YCP ) ఇవ్వను.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను.
బీజేపీతో కలిసి వెళ్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఓట్లు వస్తాయో.గెలుపు అంచుల దాకా వచ్చే ఓట్లు వస్తాయో తెలీదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో 2024 ఎన్నికలకు ఛాన్స్ తీసుకోదల్చుకోలేదని.అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజల సమగ్రతను దెబ్బతీయాలని జగన్ చూస్తుంటారని అవనిగడ్డ సభలో పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
కచ్చితంగా జరగబోయే ఎన్నికలలో జనసేన- టీడీపీ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు.