టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) వారసురాలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సితార ( Sitara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఇప్పటికే పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అలాగే ఎన్నో షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు.
హైదరాబాద్లో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలలో ఒకటైనటువంటి మ్యాక్స్ (Max) అతి పెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది.ఇక సితార చేతుల మీదుగా ఈ బొమ్మల ప్రారంభింప చేశారు.
ఈ కార్యక్రమంలో నమ్రత ( Namrata )కూడా సందడి చేశారు.
ఇలా మ్యాక్స్ కంపెనీ( MAX Company ) దసరా సందర్భంగా వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులను అతి తక్కువ ధరలకే కస్టమర్లకు వినియోగించనున్న నేపథ్యంలో ఈ కొలువు ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.నెలరోజుల పాటు ఈ సమస్త ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేయనున్నారు.హైదరాబాదులోని కెపిహెచ్ బీ ఓ మాల్ లో ఈ కొలువు ఏర్పాటు చేశారు.
పండుగ సందర్భంగా ఏర్పాటు చేయడమే కాకుండా అత్యంత తక్కువ ధరకే వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.ఇక బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్జీవోల సంస్థ నుంచి వృద్ధులు అలాగే అనాధ పిల్లలకు కానుకలు అందజేశారు.
ఇలా సితార వీరందరికీ వేదికపై కానుకలు అందజేస్తూ వారితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా ఎన్జీవో సంస్థల నుంచి వృద్ధులు ఇక్కడికి రావడంతో సితార వారిని స్వయంగా వేదిక పైకి తీసుకెళ్లి వారికి కానుకలు అందజేశారు.అనంతరం ఈ చిన్నారిని కొందరు వృద్ధులు ముద్దాడుతూ సందడి చేశారు.మొత్తానికి ఇలా బొమ్మల కొలువు రూపంలో అత్యంత తక్కువ ధరకే అన్ని రకాల ఫ్యాషన్ దుస్తులను( Fashion Wear ) నెలరోజుల పాటు అందించడానికి మ్యాక్స్ సమస్థ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.