బిగ్ బాస్ 7 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. బయటపడిన అసలు విషయం?

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రియాలిటీ షో లలో బిగ్ బాస్( Bigg Boss )రియాలిటీ షో ఒకటి.ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది ఇక తెలుగులో అయితే ఇప్పటికే ఆరు సీజన్లోని పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం ఏడవ సీజన్ అవుతుంది.

 Bigg Boss 7 Telugu Host Nagarjuna Remuneration Goes Viral, Bigg Boss, Remunerati-TeluguStop.com

ఈ సీజన్లో భాగంగా ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు.మొత్తం 14 మందితో ఎంతో ఘనంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ గా 11 మంది హౌస్ లో ఉన్నారు.

Telugu Bigg Boss, Nagarjuna, Telugu-Movie

ఇకపోతే తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) వ్యాఖ్యతగా వ్యవహరించారు.ఇక రెండవ సీజన్ కు నాని(Nani ) వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అప్పటినుంచి ఇప్పటివరకు నాగార్జున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు.అయితే నాగార్జున ( Nagarjuna )పట్ల ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం ఈ విమర్శలను పట్టించుకోకుండా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇలా మూడవ సీజన్ నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున ఈ షో కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న విషయాల గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి.

Telugu Bigg Boss, Nagarjuna, Telugu-Movie

ఇకపోతే తాజాగా మరోసారి ఈ కార్యక్రమం కోసం నాగార్జున తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ షో కోసం నాగార్జున ఈ సీజన్ మొత్తానికి కలిపి సుమారు 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ( Remuneration ) అందుకుంటున్నారని తెలుస్తోంది.ఇక నాగార్జున సినిమా చేసిన ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేరు.

అందుకే ఈయన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది.ఇలా నాగార్జున సీజన్ సెవెన్ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్త తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube