చాట్‌జీపీటీకి పోటీగా దేశీయ చాట్‌బాట్ రూపొందించిన ఇండియన్ కుర్రోడు..!

చాట్‌జీపీటీ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ భారతీయులకు ఇటీవల ఒక సవాలు విసిరారు.చాట్‌జీపీటీ ( chatgpt )వంటి AI టూల్ అభివృద్ధి చేయాలంటూ భారతీయ సమాజాన్ని ఛాలెంజ్ చేశారు.హర్యానాకు చెందిన 14 ఏళ్ల బాలుడు కార్తీక్ ఈ సవాలును స్వీకరించాడు.67 భాషల్లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల స్వదేశీ AI చాట్‌బాట్ రఘురాయ్‌ ( Raghurai )ను సృష్టించాడు.కేవలం 14 ఏళ్ల వయసుకే ఏఐ చాట్‌బాట్( AI chatbot ) రూపొందించడం మామూలు విషయం కాదు.ఇది అతని ప్రతిభ, సంకల్పం, కృషికి నిదర్శనం.

 An Indian Boy Created A Domestic Chatbot To Compete With Chatgpt, Indian Innova-TeluguStop.com

రఘురాయ్ చాట్‌బాట్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది, అయితే ఇది ఇప్పటికే అనేక రకాల అంశాలపై కచ్చితమైన, లేటెస్ట్ సమాచారాన్ని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇది పద్యాలు, కోడ్, స్క్రిప్ట్‌లు, మ్యూజికల్ నోట్స్, ఇమెయిల్, లెటర్‌లు మొదలైన టెక్స్ట్ కంటెంట్ విభిన్న క్రియేటివ్ టెక్స్ట్ ఫార్మాట్లను కూడా రూపొందించగలదు.ఇన్ని పనులను సమర్థవంతంగా చేయగల చాట్‌బాట్‌ను తయారు చేయడం 14 వేల కుర్రాడికి ఎలా సాధ్యమైందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

రఘురాయ్‌పై పేటెంట్ హక్కులు పొంది ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కార్తిక్ కృషి చేస్తున్నాడు.కస్టమర్ సేవను అందించడం, విద్యార్థులకు వారి హోంవర్క్‌లో సహాయం చేయడం, వైకల్యాలున్న వ్యక్తులకు సహాయం చేయడం వంటి వివిధ మార్గాల్లో రఘురాయ్ చాట్‌బాట్‌ను ఉపయోగించాలని అతను ఆశిస్తున్నాడు.భారతీయ ఆవిష్కరణల సామర్థ్యానికి రఘురాయ్ ఒక గొప్ప ఉదాహరణ.

కార్తీక్ కథ మనందరికీ స్ఫూర్తిదాయకం.మనసు పెడితే ఏ వయసులోనైనా అద్భుతాలు సృష్టించచ్చని ఈ బాలుడు నిరూపించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube