బిగ్ బాస్ అంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మరి తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 6 సీజన్స్ ముగించుకున్న విషయం తెలిసిందే.
ఇక 7వ సీజన్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది.గత సీజన్ ప్లాప్ అవ్వడంతో ఈసారి అన్ని పగడ్బందీగా ప్లాన్ చేసి సీజన్ 7 ను సెప్టెంబర్ 3న గ్రాండ్ గా అట్టహాసంగా స్టార్ట్ చేసింది.
ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జుననే చేస్తుండగా హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పటికే రెండు వారాలు పూర్తి కూడా చేసుకుంది.మూడవ వారం కూడా ముగింపు అయ్యే దశకు చేరుకుంది.రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కూడా అయ్యారు.ఇక ఈ వారం కూడా హౌస్ లో ఎలిమినేషన్ జరగనుంది.ఇదిలా ఉండగా ఈసారి బిగ్ బాస్ 7( Bigg Boss 7 ) లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరు ఒక్కోలా ఆడుతున్నారు.
అయితే కొంత మంది మాత్రమే ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.మరి మూడవ వారంలో ఓటింగ్ మొత్తం తారుమారు అయ్యింది. ఉల్టా ఫుల్టా ( Ulta Fulta )అనే కాన్సెప్ట్ తో ఈసారి బిగ్ బాస్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.అదే విధంగా ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఊహించని షాకులు ఇస్తున్నారు.
వారి ఆట తీరును బట్టి ఒక్కో వారం ఎవరికీ ఓటింగ్ వేయాలని డిసైడ్ చేసుకుంటున్నారు.ఇక గత రెండు వారాలుగా బిగ్ బాస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా యావర్ ను మిగిలిన కొంత మంది కంటెస్టెంట్స్ శారీరక, మానసిక హింసకు గురి చేసారు.దీంతో ఇతడు అన్ని భరించి కంటెండర్ రేసులో నిలిచాడు.అయినప్పటికీ శోభా, ప్రియాంక( Shobha, Priyanka ) కలిసి ఇతడిని పక్కన పెట్టడంతో ఏడ్చాడు.ఆవేదన మొత్తం బయటకు కక్కేసాడు.
తన ఆటకు ముందు నుండి సరైన గుర్తింపు రావడం లేదని వాపోయాడు.ఇదంతా ప్రిక్స్ యావర్( prince yawar ) కు బాగా కలిసి వచ్చింది.ఈసారి ఓటింగ్ ముందు రెండు రోజులు ఒకలా ఉంటే ఆ తర్వాత మొత్తం కథ మారిపోయింది.దినాలు గా వీకెండ్ కు వచ్చే సరికి ఓటింగ్ లో టాప్ లో ప్రిన్స్ ను ఆడియెన్స్ నిలబెట్టారు.
అలాగే చికెన్ టాస్క్ లో అన్యాయం జరిగిన గౌతమ్ కు రెండవ స్థానం ఇచ్చారు.ఓటింగ్ పరిశీలిస్తే.టాప్ లో ప్రిన్స్, రెండవ స్థానంలో గౌతమ్, మూడవ స్థానంలో అమర్ దీప్ ఉన్నారు.ఇక ఆ తర్వాత నాలుగు ఐదు స్థానాల్లో ప్రియాంక జైన్, రతిక ఉండగా ఆరు, ఏడు స్థానాల్లో దామిని, శుభ శ్రీ ఉన్నారు.
ఇలా డేంజర్ లో లాస్ట్ ఇద్దరు ఉన్నప్పటికీ ఈ వారం మాత్రం దామిని బయటకు రాబోతుందని తెలుస్తుంది.