చట్టం ఎవరికైనా ఒకటే..: సీఎం జగన్

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పర్యటనలో భాగంగా సీఎం జగన్ వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.అనంతరం చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 Law Is Same For Anyone..: Cm Jagan-TeluguStop.com

అవినీతి కేసులో ఆధారాలతో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని సీఎం జగన్ అన్నారు.చట్టం ఎవరికైనా ఒక్కటేనని స్పష్టం చేశారు.

చంద్రబాబులా ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు.అక్రమాలు చేసిన వ్యక్తిని కాపాడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సీఎం జగన్ చట్టం అందరికీ సమానం అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు గురించి రెండు విషయాలను గుర్తు చేశారు సీఎం జగన్.గతంలో ఆడియో, వీడియో టేపుల్లోనూ చంద్రబాబు అడ్డంగా దొరికారని, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులిచ్చి అడ్డంగా దొరికారన్న విషయాన్ని గుర్తు చేశారు.

అయితే ఇంత డైరెక్ట్ గా చంద్రబాబు దొరికిన బాబు చేసింది అసలు నేరమే కాదని కొందరు వాదించారన్నారు.అందుకు కారణం చంద్రబాబు అక్రమాలలో వారికి కూడా వాటా ఉండటమేనని స్పష్టం చేశారు.

ఈ విషయాలపై ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని సీఎం జగన్ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube