మ్యాచో స్టార్ గోపీచంద్ ( Gopichand )గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఈయన గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
మంచి కటౌట్ ఉండడమే కాకుండా మంచి డైలాగ్స్ కూడా చెప్పగల సత్తా ఉండడంతో హీరోగా రాణిస్తున్నాడు.అయితే ఈయన ఎంచుకునే సినిమాలే పెద్దగా కలిసి రావడం లేదు.
ఏ సినిమా చేసిన రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకుల నుండి రిజక్షన్ వస్తుంది.

ఇక ఇటీవలే ఈయన మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. లౌక్యం( Loukyam ), లక్ష్యం వంటి రెండు సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ తో రామబాణం చేయగా ఇది కూడా ఆకట్టుకోలేక పోయింది.ఇక ప్రస్తుతం డైరెక్టర్ హర్ష( Director Harsha ) దర్శకత్వంలో భీమా సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈయన తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు.కామెడీ అండ్ యాక్షన్ సినిమాల డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించారు.

శ్రీను వైట్ల ( Srinu Vaitla )ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి అందించి ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా రాణించాడు.అయితే గత కొంత కాలంగా ఈయన రొటీన్ సినిమాలతో ప్రేక్షకులకు బోర్ కొట్టించడంతో వరుస ప్లాప్స్ వచ్చాయి.అందుకే స్టార్ హీరోలు ఎవరు ఛాన్సులు ఇవ్వడం లేదు.అయితే ఎన్నో రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ గోపీచంద్ తో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు.ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.చిత్రాలయం స్టూడియోస్ సంస్థపై వేణు దోనేపూడి నిర్మిస్తుండగా టైటిల్ గురించి అప్డేట్ ఒకటి వైరల్ అయ్యింది.
ఈ సినిమాకు ”విశ్వం” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్.ఈ టైటిల్ అయితే స్క్రిప్ట్ కు తగ్గట్టు సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట.
దీంతో గోపీచంద్ ఎప్పటి లాగానే టైటిల్ విషయంలో సెంటిమెంట్ ను ఫాలో అవుతుండగా ఈ సినిమా ఈ ఇద్దరికీ ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.