టాటా గ్రూప్, ఎన్విడియా (NVIDIA) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫామ్‌లను భారతదేశానికి పరిచయం చేసేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.ఈ విషయాన్ని తాజాగా టాటా గ్రూప్( TATA Group ) ప్రకటించింది.
దీనికంటే ముందే ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫామ్‌ను ఇండియాలో అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్విడియా కంపెనీతో చేతులు కలిపినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్( Reliance Industries ) అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ ప్రకటించింది.ఇప్పుడు టాటా గ్రూప్ కూడా దానితో పార్ట్నర్షిప్ ప్రకటించడంతో ముఖేష్ అంబానీ పై( Mukesh Ambani ) రతన్ టాటా( Ratan Tata ) అని నేరుగా ఏఐ వార్ ప్రకటించినట్లు అయింది.
అంతేకాదు ఎన్విడియాతో డబుల్ డీల్ కుదుర్చుకున్నట్లు అయ్యింది.
భారతదేశంలో AI పరిష్కారాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి, AI ప్రతిభను పెంచడానికి ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ సహాయపడతాయి.ఇక టాటా గ్రూప్ తో భాగస్వామ్యం ద్వారా నెక్స్ట్ జనరేషన్ NVIDIA® GH200 గ్రేస్ హాప్పర్ సూపర్‌చిప్ ద్వారా ఆధారితమైన AI సూపర్ కంప్యూటర్ను ఎన్విడియా కంపెనీ డెవలప్ చేస్తుంది.ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన AI సూపర్కంప్యూటర్లలో ఒకటిగా అవతరిస్తుంది.
హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రావెలింగ్ వంటి వివిధ పరిశ్రమలలో AI అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి, రన్ చేయడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించడం జరుగుతుంది.
టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన టాటా కమ్యూనికేషన్స్( Tata Communications ) కూడా ఈ భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి అయిన AI మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను ఉపయోగించుకుంటుంది.ఈ భాగస్వామ్యం భారతదేశంలో ఏఐ అభివృద్ధికి ఒక ప్రధాన ముందడుగు.ఇది ఏఐని మరింత అందుబాటులోకి, సరసమైనదిగా చేయడానికి సహాయపడుతుంది.
ఇది దేశవ్యాప్తంగా వ్యాపారాలు, సంస్థలు ఏఐ టెక్నాలజీని స్వీకరించడాన్ని వేగవంతం చేస్తుంది.