హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.డ్రగ్స్ లింకులపై హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు ఆరా తీస్తున్నారు.
కేసులో అరెస్ట్ అయిన సినీ ఫైనాన్షియర్ వెంకట్ ప్లాట్ లో ఉన్న ఇద్దరు యువతుల వివరాలు సేకరించారు.ఈ క్రమంలో వారిద్దరూ ఢిల్లీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
సినిమాలలో అవకాశాలు కల్పిస్తానని ఇద్దరు యువతులను వెంకట్ హైదరాబాద్ కు రప్పించారని తెలుస్తోంది.గత రెండు రోజులుగా యువతులు వెంకట్ ప్లాట్ లోనే ఉన్నారని సమాచారం.
అటు మాదాపూర్ లోని అపార్ట్ మెంట్ లో పోలీసులు మరోసారి సోదాలు చేస్తున్నారు.డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో మాదాపూర్ విఠల్ రావు నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించిన నార్కోటిక్ బృందం ఐదుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.