టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )కుమారుడు గౌతమ్( Gautham )గురించి మనందరికీ తెలిసిందే.ఈయన మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో బాలనటుడిగా నటించి మెప్పించారు.
అయితే ప్రస్తుతం ఈయన ఉన్నత చదువులు చదువుతున్నటువంటి నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉన్నారు.అయితే నేడు మహేష్ బాబు తన పుట్టినరోజు( Birthday )వేడుకలను జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా మహేష్ బాబు గౌతమ్ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… హ్యాపీ 17, మై ఛాంప్.నువ్వు వేసే ప్రతి అడుగూ నిన్ను నీ లక్ష్యం వైపు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.ఆకాశాన్ని అందుకో… లవ్ యూ సో మచ్ గౌతమ్ అంటూ మహేష్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ తన కొడుకు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు గౌతమ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ ఫోటోలలో అచ్చం మహేష్ లాగే చాలా స్టైలిష్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గౌతమ్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఈయనకు సంబంధించిన ఏ విషయాలు అయినా కూడా తన తల్లి నమ్రత( Namrata )సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.గత రెండు రోజుల క్రితం ఈయన రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ని సందర్శించి అక్కడ చిన్నారులతో సమయం గడుపుతూ ఉన్నటువంటి ఫోటోలను కూడా నమ్రత అభిమానులతో పంచుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక గౌతమ్ ప్రస్తుతం ఉన్నత చదువులు నిమిత్తం విదేశాలలో చదువుతున్నారు.చదువులు పూర్తి అయిన తర్వాతనే గౌతమ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ గత ఇంటర్వ్యూలో భాగంగా నమ్రత తన కొడుకు సినీ ఎంట్రీ గురించి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.







