తగ్గేదే లే!…అంటూ భారతదేశం మొత్తాన్ని షేక్ చేసిన చిత్రం పుష్ప.సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో, అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప.2021 లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టించింది.తాజాగా విడుదలైన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో కూడా సత్తా చాటింది.
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీతానికి గాను దేవిశ్రీ ప్రసాద్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.ఐతే అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన పుష్ప రాజ్ పాత్రను సుకుమార్ రెండు పాత తెలుగు సినిమాల ఆధారంగా చిత్రీకరించారట.
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిది హీరో విజయకాంత్ నటించిన “కెప్టెన్ ప్రభాకర్( Captain Prabhakar )” చిత్రం.ఈ చిత్రంలో విల్లన్ మన్సూర్ అలీ ఖాన్ ఒక డెకాయిట్.మన్యం ప్రజలను హింసించే కిరాతకుడు.
ఈ పాత్రని తమిళ నటుడు వీరభద్రాం పోషించాడు.ఈ సినిమాలో మన్సూర్ అలీ ఖాన్ పాత్ర మాటలు, స్టైల్ చూస్తే కాస్త మన పుష్ప రాజ్ లాగానే ఉంటుంది.
పుష్ప సినిమాలో గన్ భుజం మీద పెట్టి కాల్చడం కూడా ఈ చిత్రం నుంచి తీసుకున్నదే.ఐతే విలన్ మన్సూర్ అలీ ఖాన్( Mansoor Ali Khan ) ను హీరో పుష్ప రాజ్ లా మార్చటానికి సుకుమార్ మరో సినిమాను కూడా వాడుకున్నాడు.
సుకుమార్ వాడుకున్న మరో చిత్రం “పృథ్వి నారాయణ( Prudhvi Narayana )”.రియల్ స్టార్ శ్రీహరి( Srihari ) ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసారు.ఇందులో శ్రీహరి నటించిన నారాయణ పాత్రకు కూడా పుష్ప సినిమాలో పుష్ప రాజ్ లాగానే భుజం వంగి ఉంటుంది.పుష్ప రాజ్ పాత్రలోని రఫ్ టచ్ కూడా ఈ పాత్ర లో పుష్కలంగా కనిపిస్తుంది.
కనుక పుష్ప రాజ్ పాత్ర వెనుక ఈ రెండు సినిమాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహము లేదు.ఈ రెండు చిత్రాలలో కెప్టెన్ ప్రభాకర్ మంచి విజయాన్ని సాధించింది.
కానీ శ్రీహరి నటించిన పృథ్వి నారాయణ మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.