సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా లా గురించి గానీ, ఆయన వ్యక్తిత్వం గురించి గానీ అందరికీ తెలుసు… ఆయన ఎవరికైనా ఏదైనా చేస్తాను అని మాట ఇచ్చాడు అంటే వాళ్ల కోసం ఏదైనా చేస్తాడు అలానే సినిమాల విషయం లో కూడా ఎవరితో అయిన సినిమా చేస్తాను అని వాళ్ళకి మాట ఇచ్చాడు అంటే చాలు ఆ డైరెక్టర్ తో గానీ, ఆ ప్రొడ్యూసర్ తో గానీ పక్క సినిమా తీసి వాళ్ళకి ఒక మంచి హిట్ సినిమా ఇస్తాడు అలా ఇండస్ట్రీ లో పవన్ చేత మాట తీసుకొని సినిమాలు చేసిన వాళ్ళు ఎవరో ఒకసారి తెలుసుకుందాం…
మొదట గా గుడుంబా శంకర్ సినిమా( Gudumba Shankar ) డైరెక్టర్ అయిన వీర శంకర్ గురించి చెప్పాలి ఈయన చేసిన గుడుంబా శంకర్ సినిమా కమర్షియల్ గా వర్క్ ఔట్ అవ్వలేదు.నిజానికి వీర శంకర్ అనే డైరెక్టర్( Director Veera Shankar ) కి ఇంతకు ముందు పెద్ద హీరోలతో చేసిన అనుభవం కూడా లేదు.ఆయన అంతకు ముందు తీసిన సినిమాలు కూడా పెద్ద సక్సెస్ అయిన సినిమాలు కాదు కానీ ఆయనకి ఇచ్చిన మాటకి కట్టుబడి పిలిచి మరీ అతనికి ఈ సినిమా డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చాడు…
ఇక రెండోవ వ్యక్తి హరీష్ శంకర్( Director Harish Shankar ) ఈయన మిరపకాయ్ సినిమా స్టోరీ తీసుకెళ్ళి మొదట పవన్ కళ్యాణ్ గారికి చెబితే కథ బాగానే ఉంది కానీ నెక్స్ట్ మనం ఇంకో సినిమా చేద్దాం అని ఆయనకి మాట ఇచ్చి పంపించాడు మళ్లీ పవన్ కళ్యాణ్ తనని పిలిపించి మరి తనతో గబ్బర్ సింగ్ సినిమా చేశాడు…
ఇక అలాగే ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి కూడా తీన్ మార్ సినిమా( Teenmaar Movie )తో ప్లాప్ రావడం తో ఆయనకి మరో సినిమా చేస్తాను అని చెప్పి గబ్బర్ సింగ్ సినిమా ఇచ్చి అతన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లో నిలబెట్టాడు…అలగే డైరెక్టర్ బాబీ( Director Bobby ) కి ఇచ్చిన మాట ప్రకారం ఆయనకి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఇచ్చాడు ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా కూడా బాబీ కి మాత్రం ఇదొక మంచి ఛాన్స్ అనే చెప్పాలి…
.