మోమోస్‌ను( Momos ) ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు.మోమోస్ లో చాలా రకాలు ఉంటాయి.
నాన్ వెజ్‌ను ఇష్టపడేవారి కోసం చికెన్ మోమోస్, వెజిటేరియన్ లవర్స్ కోసం వెజ్ మోమోస్ కూడా ఉంటాయి.మంచి టేస్టీగా, స్పైసీగా ఉండే వీటిని తినేందుకు యువత ఇష్టపడతారు.
స్నేహితులతో కలిసి వేడి వేడి మోమోస్ ను తింటూ కబుర్లు చెప్పుకుంటుంటే ఆ థ్రిల్ వేరే ఉంటుంది.బయట రోడ్డు మీద ఉండే బండ్ల మీద కూడా మోమోస్ తయారుచేసి అప్పటికప్పుడు సర్వ్ చేస్తూ ఉంటారు.
అలాగే పెద్ద పెద్ద మాల్స్ లోనూ మోమోస్ సెంటర్లు ప్రత్యేకంగా ఉంటాయి.అయితే ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్( Professor of English ) రోడ్డు మీద స్ట్రీట్ పుడ్ స్టాల్‌లో మోమోస్ అమ్ముతున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎంతో టేస్టీగా తయారుచేసిన మోమోస్‌ను వినియోగదారులకు విక్రయిస్తున్నాడు.మంచి రుచికరంగా ఉండటంతో పాటు స్టాల్ వద్ద శుభ్రతను పాటిస్తుండటంతో.ప్రొఫెసర్ స్టాల్ దగ్గర తినేందుకు జనం ఎగబడుతున్నారు.
లక్నోలో( Lucknow ) ఈ ఇంగ్లీస్ ప్రొఫెసర్ మోమోస్ పాయింట్ ఇప్పుడు చాలా పాపులర్ అయింది.
ఈ ఫ్రొఫెసర్ వీడియోకు ఇప్పటివరకు కోటి వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోలో తన బండి దగ్గరకు వచ్చిన కస్టమర్లకు మోమోస్ ప్లేట్‌ను ప్రొఫెసర్ అందిస్తున్నాడు.ఇంట్లో తయారుచేసిన మోమోస్ రుచి ఎలా ఉందో చూడండి.వీటి రుచి మీకు తప్పకుండా నచ్చుతుందని చెబుతున్నాడు.ఎంతో రుచిగా చేసిన ఫేవరేట్ స్నాక్స్‌ను మీరు తింటే ఇందులో ఏ పదార్థాలు ఉపయోగించాననేది తెలుస్తుందంటూ వైరల్ అవుతున్న వీడియో క్లిప్ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ చెబుతున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు అనేక కామెంట్స్ పెడుతున్నారు.ఇంగ్లీష్ ప్రొఫెసర్ లో చాలా కళలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.