ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో బవిష్యత్తు రాజకీయం అంతా జనసేన పార్టీ( JanaSena Party ) తోనే ముడి పడి ఉన్నట్టుగా కనిపిస్తుంది .నిజానికి సొంతంగా గెలిచే శక్తి జనసేన పెంచుకుందో లేదో తెలియదు గాని ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీల్లో ఒక దాన్ని ఓడించే శక్తి మాత్రం జనసేనకు కచ్చితంగా ఉందని చెప్పవచ్చు.
ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా తన అశేష సినీ అభిమానులతో ప్రత్యేకమైనవర్గం ఉండటంతో పాటు సామాజిక వర్గ పరంగాను రాష్ట్రంలో ప్రభావంతమైన పట్టు ఉన్న సామాజిక వర్గం పవను ను ఓన్ చేసుకోవడంతో కచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పార్టీగానే జనసేన చూడాల్సి వస్తుంది .
అయితే ప్రస్తుత అదికార పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దించాలని గట్టి పట్టుదలగా ఉన్న పవన్ ( Pawan Kalyan )వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులతోనే వెళ్తామని ప్రకటించినప్పటి నుంచి పొత్తులు ఎప్పుడు ఫైనల్ అవుతాయా అని ఇటు జనసేన- తెలుగుదేశం కార్యకర్తలతో పాటు అటు అధికార వైసిపి కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నా.రు ఎందుకంటే ఒక్కసారి పొత్తులు ఫైనలైతే బలాబలాలు సరిచూసుకొని ప్రజాక్షేత్రంలోకి దూసుకు వెళ్లడానికి రెండు పార్టీల వ్యూహా నిపుణులు ఎదురుచూస్తున్నారు.
ఏ స్ట్రాటజీతో ప్రజల్లోకి వెళ్లాలి, పొత్తులు ఎదుర్కొనే వ్యూహాలు ఎలా రూపొందించుకోవాలన్నది అధికార పార్టీకి పొత్తులు ఫైనల్ అయితే గాని ఒక అంచనాకొచ్చే అవకాశం లేదు.కానీ పవన్ మాత్రం పొత్తుల విషయంలో గుప్పిట మూసే ఉంచుతున్నారు.తమ వారాహి యాత్ర పూర్తి అయిన తర్వాత తమ బలాన్ని అంచనా వేసుకొని మాత్రమే పొత్తులపై నిర్ణయం తీసుకోవాలన్న వ్యూహం తో ఆచితూచి పవన్ వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది.
అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల తర్వాత భాజాపా( Bjp party )కు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై స్పష్టమైన అంచనాకొచ్చే అవకాశం ఉన్నందున జనవరి తర్వాతే పొత్తులను జనసేన ని ఫైనల్ చేస్తుందని వార్తలు వస్తున్నాయ దాంతో పవన్ గుప్పిట తెరిచే రోజు కోసం రాష్ట్ర రాజకీయాలు ఎదురుచూస్తున్నాయనే చెప్పాలి
.