విజయనగరం జిల్లాలో నిర్మించనున్న కేంద్ర గిరిజన యూనివర్సిటీకి రేపు శంకుస్థాపన జరగనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.ఈ వర్సిటీకి సీఎం జగన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.
యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో భూమిని సేకరించి అప్పగించామని తెలిపారు.యూనివర్సిటీ కోసం సుమారు 530 ఎకరాల భూమిని సేకరించామన్న మంత్రి బొత్స ప్రైవేట్ భూమికి కూడా పరిహారం చెల్లించామని వెల్లడించారు.ఈ మేరకు పరిహారం కింద ఇవ్వాల్సిన రూ.1.30 కోట్లు విడుదల చేశామని తెలిపారు.విద్యా వ్యవస్థలో చేసిన మార్పులను కేంద్ర మంత్రికి వివరిస్తామని స్పష్టం చేశారు.