ప్రపంచంలో అత్యంత పాపులర్ అయిన 10 యాప్‌లు ఇవే..

ఆండ్రాయిడ్ యాప్స్‌( Android Apps ) వచ్చాక ఇంటర్నెట్ యూజర్ల జీవితం సింపుల్‌గా మారింది.వారి లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది.

 These Are The World Famous Top 10 Apps Fb Tiktok Instagram Whatsapp Details, Wor-TeluguStop.com

ఇప్పుడు ప్రతి ఒక్క పని ఆండ్రాయిడ్ యాప్స్‌ ద్వారా చేసుకోవడం కుదురుతోంది.వీటితో ఆన్‌లైన్ షాపింగ్, బ్యాంకింగ్ ట్రాన్సక్షన్స్, ఫుడ్ డెలివరీ సర్వీసెస్, కమ్యూనికేషన్, ఆఫీస్ వర్క్, జాబ్ పొందడం ఇలా ప్రతిదీ సులభతరం అయ్యాయి.

నిజానికి గూగుల్ ప్లే స్టోర్‌లో లక్షల కొద్దీ యాప్‌లు ఉన్నాయి, అయితే కొన్ని ఇతర వాటి కంటే ఎక్కువ పాపులర్ అయ్యాయి.ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ పాపులర్ యాప్స్‌లో టాప్ 10 యాప్‌లు ఉన్నాయి.అవేవో చూద్దాం.

• టిక్‌టాక్:

టిక్‌టాక్( Tiktok ) అనేది వీడియో-షేరింగ్ యాప్, ఇది వినియోగదారులను షార్ట్ వీడియోలను క్రియేట్ చేసి షేర్ చేయడానికి అనుమతిస్తుంది.ఇది వరుసగా మూడో సంవత్సరం ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌గా రికార్డు సృష్టించింది.

• ఇన్‌స్టాగ్రామ్:

ఇన్‌స్టాగ్రామ్( Instagram ) అనేది ఫొటో, వీడియో-షేరింగ్ యాప్, ఇది వినియోగదారులు వారి ఫోటోలు, వీడియోలు, రీల్స్ స్నేహితులు, ఫాలోవర్లతో పంచుకోవడానికి అనుమతిస్తుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీలు బాగా యాక్టివ్ గా ఉంటారు.వారి ఫొటో, వీడియోల అప్‌డేట్స్‌ ఇక్కడ ఫాస్ట్ గా పొందొచ్చు.

Telugu Android Apps, App, Messenger App, Downloaded Apps, Snapchat, Spotify, Tec

• ఫేస్‌బుక్:

ఫేస్‌బుక్( Facebook ) అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ఇది వినియోగదారులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది.బిజినెస్ రీచ్ పెంచుకోవడం, రెవెన్యూ సంపాదించడం, ఇంకా చాలా ప్రయోజనాలను ఫేస్‌బుక్ అందిస్తుంది.

• వాట్సాప్:

వాట్సాప్( Whatsapp ) అనేది మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు పంపడానికి వినియోగదారులను అనుమతించే మెసేజింగ్ యాప్. ఇది 99% ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఉంటుందని అనడంలో సందేహం లేదు.

Telugu Android Apps, App, Messenger App, Downloaded Apps, Snapchat, Spotify, Tec

• క్యాప్‌కట్:

క్యాప్‌కట్( Capcut ) అనేది వీడియో ఎడిటింగ్ యాప్, ఇది షార్ట్ వీడియోలను ఎడిట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.ఇది టిక్‌టాక్ వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందింది.

• టెలిగ్రామ్:

టెలిగ్రామ్( Telegram ) అనేది ప్రైవసీ, సెక్యూరిటీపై దృష్టి సారించే మెసేజింగ్ యాప్. ఇది ఏ డేటా సైజుల్లో అయినా మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

Telugu Android Apps, App, Messenger App, Downloaded Apps, Snapchat, Spotify, Tec

• స్నాప్‌చాట్:

స్నాప్‌చాట్( Snapchat ) అనేది ఒక మల్టీమీడియా మెసేజింగ్ యాప్, ఇది డిసప్పియరింగ్ మెసేజ్‌లు పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.ఇది దాని ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్లకు కూడా ప్రసిద్ధి చెందింది.

• స్పాటిఫై:

స్పాటిఫై( Spotify ) అనేది మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్, ఇది వినియోగదారులు ఆన్-డిమాండ్‌ మ్యూజిక్ వినడానికి అనుమతిస్తుంది.ఇది పాటలు, పాడ్‌కాస్ట్‌ల బిగ్ లైబ్రరీని కలిగి ఉంది.

Telugu Android Apps, App, Messenger App, Downloaded Apps, Snapchat, Spotify, Tec

• టెము:

టెము (Temu) అనేది చైనాలో పాపులర్ అయిన ఆన్‌లైన్ షాపింగ్ యాప్. ఇది తగ్గింపు ధరలలో అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది.

• మెసెంజర్:

మెసెంజర్ ( Messenger ) అనేది ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన Meta నుంచి వచ్చిన మెసేజింగ్ యాప్. ఇది వినియోగదారులు మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు పంపడానికి అనుమతిస్తుంది.

ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లలో ఇవి కొన్ని మాత్రమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube