హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రకటనతో కాంగ్రెస్ సీట్ల దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయని తెలుస్తోంది.ఈ మేరకు గాంధీభవన్ లో దరఖాస్తులకు రద్దీ పెరిగింది.
ఆశావాహుల రాకతో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ కిటకిటలాడుతోంది.ఇప్పటివరకు 280 దరఖాస్తులు రాగా నిన్న ఒక్కరోజే సుమారు 220 దరఖాస్తులు రావడం విశేషం.
దరఖాస్తులకు చివరి తేదీ 25 కాగా మరో 200 దరఖాస్తుల రావొచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల రాకతో గాంధీభవన్ లో సందడి వాతావరణం నెలకొంది.
కాగా వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.