టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ గన్నవరంలో లోకేశ్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
లక్ష మంది జనసమీకరణతో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న టీడీపీ నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీని టార్గెట్ చేసిందని తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న వల్లభనేని వంశీకి చెక్ పెట్టే దిశగా టీడీపీ అడుగులు వేస్తుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గన్నవరం సభను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్థం అవుతుంది.అదేవిధంగా ఇటీవల గన్నవరం కీలక నేత యార్లగడ్డ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బహిరంగ సభ ద్వారా టీడీపీ బల నిరూపణకు సిద్ధమైనట్లు తెలుస్తుండగా లోకేశ్ సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.