మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Hero Varun Tej ) ఒకరు.డిఫరెంట్ కథలతో కాన్సెప్ట్ లతో అలరించే వరుణ్ తాజాగా మరో ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కథల ఎంపికలో తనదైన పంథాను కొనసాగిస్తున్న వరుణ్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ మార్కెట్ పై ద్రుష్టి పెట్టారు.ప్రజెంట్ వరుణ్ తేజ్ క్రేజీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.
ఆ లైనప్ లో ముందుగా రిలీజ్ కానున్న మూవీ ”గాండీవధారి అర్జున”( Gandeevadhari Arjuna ) ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.అందుకే మేకర్స్ ఒక్కొక్కటిగా అన్ని పనులు పూర్తి చేస్తున్నారు.ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
ఈ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Mega Powerstar Ram Charan ) చేతుల మీదుగా రిలీజ్ కాబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.నెక్స్ట్ వీకెండ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నారు.
అలాగే ఈ రోజే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న వేదిక మీదనే ట్రైలర్ లాంచ్ చేయనున్నారు.
మరి ఈ ట్రైలర్( Gandeevadhari Arjuna Trailer ) ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో తెలియాలంటే ఆగస్టు 25 వరకు వేచి ఉండాల్సిందే.