టాలీవుడ్ దర్శకుల్లో సుకుమార్( Sukumar ) శైలి చాలా విభిన్నమైనది అనడంలో సందేహం లేదు.ఆయన సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
ఆయన శిష్యులు చాలా మంది ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.వారిలో కొందరు దర్శకులుగా సక్సెస్ అవ్వగా కొందరు మాత్రం నిరాశ పరిచారు.
సుకుమార్ శిష్యులు అనగానే గుర్తుకు వచ్చే పేరు నిస్సందేహంగా బుచ్చిబాబు( Director Buchibabu ) అనడంంలో సందేహం లేదు.ఉప్పెన సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో ఉప్పెన సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.మొదటి సినిమాతోనే ఒక దర్శకుడు వంద కోట్లు దక్కించుకోవడం రికార్డ్.

అంతే కాకుండా మొదటి సినిమా తోనే హీరో గారు వంద కోట్ల దక్కించుకోవడం, హీరోయిన్ మొదటి సినిమా తోనే వంద కోట్ల దక్కించుకోవడం రికార్డ్ గా చెప్పుకోవచ్చు.అందుకే ఉప్పెన సినిమా ను ( Uppena Movie ) బుచ్చిబాబు అంత సులభంగా మర్చిపోయే లా లేడు.ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) సినిమాకు బుచ్చిబాబు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న చరణ్ మూవీ ని ఉప్పెన టెంప్లేట్ తో బుచ్చిబాబు రూపొందించబో అవకాశాలు కనిపిస్తున్నాయి.ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) ఎలా అయితే ఒక పల్లెటూరు కుర్రాడో అలాగే చరణ్ కూడా రాబోయే సినిమాలో పల్లెటూరు కుర్రాడుగా కనిపించబోతున్నాడు.

అంతే కాకుండా ఈ సినిమాలో కూడా ఉప్పెన లో నటించిన విజయ్ సేతుపతి( Vijay Setupathi ) కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఇక హీరోయిన్ గా ఒకే ఒక్క అమ్మాయి నటించబోతుంది.ఇద్దరు హీరోయిన్స్, ఐటెం సాంగ్ అంటూ ప్రత్యేకంగా లేకుండా సింగిల్ హీరోయిన్ తోనే ఉప్పెన సినిమాను ఎలా అయితే రూపొందించాడో అలాగే ఈ సినిమాను కూడా ముగించాలని దర్శకుడు బుచ్చి బాబు భావిస్తున్నాడు.చరణ్ మూవీ కూడా సక్సెస్ అయితే అప్పుడు బుచ్చి బాబు వరుసగా ఉప్పెన ఫార్ములాతోనే సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.







