డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే ఒక్క డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయ్యారు లలిత జ్యువెలరీ (Lalitha Jewellery)ఎండి కిరణ్ కుమార్(M.D Kiran Kumar).
ఈయన గోల్డ్ జ్యువెలరీ సంస్థలను నెలకొల్పి ఇప్పటివరకు మన రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 50 షో రూమ్లను ప్రారంభించి బిజినెస్ మెన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.అయితే తాజాగా కర్నూలులో తన లలితా జ్యువెలరీ 51వ షోరూం ప్రారంభించారు.
ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పలువురు రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై ఈ షోరూం ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇది తన 51వ షోరూం(Lalitha Jewellery Showroom) అని తెలిపారు.అయితే నా షో రూమ్ లో ఎవరు బంగారం కొనమని నేను ఎప్పుడూ చెప్పనని నా షాప్ కి వచ్చి మీకు నచ్చిన నగ ఫోటో తీసుకొని బయట కంపేర్ చేసి నచ్చితే కొనమని మాత్రమే చెబుతున్నానని ఈయన తెలియజేశారు.ఇక దేశవ్యాప్తంగా తన షోరూమ్స్ విస్తరింప చేయాలన్నదే నా లక్ష్యమని ఈ సందర్భంగా కిరణ్ కుమార్( Kiran Kumar ) వెల్లడించారు.ఇకపోతే మీరు రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజమని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కిరణ్ కుమార్ సమాధానం చెబుతూ రాజకీయాలలోకి (Politics) రానని, అలాగే సినిమాలలో(Movies) కి కూడా రానని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ జన్మకు తాను ఈ వ్యాపార రంగంలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా ఎండి కిరణ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.