తాము చేసిన అభివృద్ధి ద్వారా తాము చేపట్టిన సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని , వ్యవసాయ రంగంలో గణ నీయమయిన అబివృద్ది జరిగినది అని ఇప్పుడు ఏడాదికి మూడు పంటలు పండే స్థాయికి తెలంగాణ వ్యవసాయ రంగం( Agriculture sector ) అభివృద్ధి చెందిందని హెలికాప్టర్ నుంచి చూస్తూ ఉంటే రాశులు పోసినట్టుగా రహదారులన్నీ ధాన్యంతో నిండి పోతున్నాయని కేసీఆర్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు.తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని పేద వర్గాలను వెనకబడిన వర్గాలను ధనవంతులుగా మారుస్తున్నామని తాము అమలుచేస్తున్న సంక్షేమ పథకాల( Welfare schemes, ) వల్ల దేశం లోనే సంపన్నవంత మైన రాష్ట్రం గా తెలంగాణ మారుతుందని కేసీఆర్ చెప్పుకొస్తూ ఉంటారు.
అయితే దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉంటాయి .
అయితే ఇప్పుడు కేంద్రంలో విడుదల చేసిన ఒక రిపోర్ట్ కేసీఆర్( CM KCR ) వ్యాఖ్యలు నిజమేనని ప్రపంచానికి చాటినట్లు అయింది.తలసరి ఆదాయంలో సంపన్న రాష్ట్రాలే న కర్ణాటక, హర్యానాను తోసిరాజని తెలంగాణ ముందు స్థానంలో నిలబడటం విశేషం.తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో కేవలం 1,72,000 మాత్రమే ఉన్న తలసరి ఆదాయం 2022 -23 లెక్కల ప్రకారం 3.12 లక్షలకు పెరగటం విశేషం అంటే దాదాపు 150 శాతానికి పైగా పెరుగుదల నమోదు అయినట్లుగా తెలుస్తుంది.దీనితో దేశంలోని సంపన్న రాష్ట్రాల లిస్టులో తెలంగాణ నిలవడమే కాకుండా దేశానికి అత్యధిక పనులు కడుతున్న రాష్ట్రంగా కూడా నిలిచింది.
ఎన్నికలకు దగ్గర్లో ఉన్న వేళ కేంద్ర ఆర్థిక శాఖ రిలీజ్ చేసిన ఈ నివేదిక కేసీఆర్ కువెయ్యి ఏనుగులు బలం ఇస్తుందనటంలో అతిశయోక్తి లేదు .ఇంత కాలం నుండి తాము చెబుతున్న అభివృద్ధిని కేంద్రమే సర్టిఫై చేసిందని, ఇప్పుడు తమకు మరో అవకాశం ఇవ్వనడాని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశాన్ని ఈ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పొచ్చు.మరి కేంద్ర ఆర్దిక శాఖ ఇచ్చిన ఈ నివేదిక పై ప్రతిపక్షాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి .