ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉడుత ఇదేనట: అటవీ అధికారి

సోషల్ మీడియాలో( Social Media ) ఎక్కువగా వన్య ప్రాణులకు సంబంధించి వింతవింత వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ వున్నాం.దానికి కారణం ఐఎఫ్‌ఎస్ అధికారులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Large Squirrel Species Found In India Details, Latest News, Trending News, Squir-TeluguStop.com

వీరిలో చాలామంది సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్‌లతో జంతువులకు సంబందించిన విషయాలు పంచుకుంటూ వుంటారు.ఈ క్రమంలోనే చాలా వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక తాజాగా ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌( IFS Parveen Kaswan ) ఓ ఉడుత ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేయడం జరిగింది.కాగా ఆ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.

అయితే దానికి కారణం చాలా పెద్ద విషయమే వుంది.అవును, అది సాధారణ ఉడుత కాదు.ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉడుతల( Longest Squirrel ) జాతిగా గుర్తింపు పొందిన జాతికి చెందిన ఉడుత మరి .నలుపు రంగులో ఉండే ఈ ఉడుత జాతిని మన దేశంలోనే గుర్తించారని మీకు తెలుసా? పశ్చిమబెంగాల్‌లోని బుక్సా టైగర్‌ రిజర్వ్‌లో తీసిన ఈ ఉడుత ఫొటోను ప్రవీణ్‌ కాస్వాన్‌ తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేశారు.ప్రపంచంలోనే అతి పొడవైన ఈ ఉడుత జాతిని భారతదేశంలోనే గుర్తించారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఆ పక్కనే బుక్సా ప్రాంతం( Buxa ) పేరు కూడా ప్రస్తావించారు.ఈ ఉడుత ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఇంకేముంది కట్ చేస్తే… ఈ ఫొటోపై నెటిజన్‌ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది.

చాలా మంది ఇది మలబార్‌ జాతి భారీ ఉడుత అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.మరికొంత మంది ఇది మలయాన్‌ జాతి ఉడుత అని కూడా కామెంట్స్ చేయడం ఇక్కడ మీరు చూడవచ్చు.

మరి మీరు ఎపుడైనా ఇలాంటి ఉడుతను చూసారో లేదో ఇక్కడ కామెంట్స్ సెక్షన్ లో చెప్పండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube