రాబోయే ఏపీ ఎన్నికల్లో టిడిపిని( TDP party )అధికారంలోకి తీసుకురావడం ఎంత అవసరమో అంతే స్థాయిలో కుప్పం నియోజకవర్గంలో బంపర్ మెజారిటీని దర్శించుకోవడం టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu )కు అత్యవసరం అన్నట్లుగా పరిస్థితి మారింది.టిడిపికి కంచుకోటగా ఉన్న కుప్పంలో ఎప్పడూ చంద్రబాబు గెలుస్తూనే వస్తున్నాడు.
అయితే 2019 ఎన్నికల తర్వాత నుంచి కుప్పం పైనే వైసిపి పూర్తిగా దృష్టి సారించింది ఈ మేరకు వైసిపి సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) నియోజకవర్గంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా అనేక వ్యూహాలను రచిస్తున్నారు.
తనకు, పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో వైసిపి జోరు పెరుగుతుండడంపై చంద్రబాబు సైతం ఆందోళనలోనే ఉన్నారు.ఈ నియోజకవర్గంలో మరింత పట్టు పెంచుకునే ప్రయత్నాలకు దిగుతున్నారు.
సొంత ఇంటిని సైతం నిర్మించుకుంటున్నారు.అయితే వరుసగా చంద్రబాబు నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తుండడం తో.2024 ఎన్నికల్లో ఆ పరిస్థితిని మార్చాలని వైసిపి లక్ష్యంగా పెట్టుకుంది.
టిడిపి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో బాబును ఓడించడం ద్వారా, ఆ పార్టీని మానసికంగా మరింత దెబ్బ కొట్టాలనే విధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు, జగన్ సైతం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి హవా చూపించింది.కుప్పం మున్సిపాలిటీని కూడా వైసిపి తమ ఖాతాలో వేసుకుంది.
ఈ విధంగా ఈ నియోజకవర్గంలో టిడిపికి అనుకూల పరిస్థితులు లేకుండా చేస్తుండడంతో, చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.వచ్చే ఎన్నికల్లో కుప్పంలో భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా చాటుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.
అందుకే ఈ నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్న పిఏ మనోహర్ తో పాటు, మిగతా నాయకులు తప్పుకున్నారు.
ఆ స్థానంలో కుప్పం బాధ్యతలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ( Kancharla srikanth )కు బాబు అప్పగించారు.అయితే శ్రీకాంత్ కు బాధ్యతలు అప్పగించడంపై పార్టీ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు.ఈ ప్రాంతంతో సంబంధంలేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ బాధ్యతలు అప్పగించడం ఏంటి అని నిలదీస్తున్నారు.
ఏదో రకంగా ఈ నియోజకవర్గంలో గెలిచి తన పరువు, పార్టీ పరువును కాపాడుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.