మనం సువాసనల కోసం పర్ప్యూమ్( Perfume ) వాడుతూ ఉంటాం.పర్ప్యూమ్ వాసన వల్ల తాము ఇష్టపడేవారిని, లేదా ప్రేమించే వారిని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు.
మార్కెట్ లో అనేక బ్రాండ్ల పర్ప్యూమ్ లు ఉన్నాయి.అలాగే అనేక రకాల ప్లేవర్స్‌లోనూ పర్ప్యూమ్ లు లభిస్తాయి.
మనకు నచ్చిన ప్లేవర్స్ ను సెలక్ట్ చేసుకుని కొనుగోలు చేయవచ్చు.అయితే మనుషులే కాదట.
జీవులు కూడా ఎదుటివారిని ఆకర్షించేందుకు పర్ప్యూమ్ తయారు చేసుకుంటాయట.
వ్యవసాయ చీడ పురుగులైన టొబాకో బడ్ వార్మ్ మాత్స్( Tobacco Budworm Moths ) ఆడవాటిని ఆకర్షించేందుకు మిథైల్ సాలిసిలేట్( Methyl Salicylate ) అని పిలవబడే పువ్వుల పరిమళాన్ని సేకరించి విడుదల చేస్తాయట.ఇది తీపి, పుదీనా కలిపిన సువాసను కలిగి ఉంటుంది.అనేక రకాల మొక్కల పుష్పాల తేనెలో ఇవి ఉంటాయి.
నార్త్ కరోలినా స్టేయ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు జరిపిన పరిశోధనల్లో ఈ పురుగులు స్వయంగా ఇలా పర్ప్యూమ్ తయారు చేసుకున్నట్లు తేలింది.సైంటిస్టులు ల్యాబ్ లలో సింథటిక్ టైప్ లో పెంచిన మంగ చిమ్మటలలో మిథైల్ సాలిసైలేట్ స్థాయిలను గుర్తించారు.
ఇక ల్యాబ్ లో పెంచిన పురుగుల కంటే వ్యవసాయ పోలాల్లో ఉండే పురుగుల్లో మిథైల్ సాలిసైలేట్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.ఆడ పురుగులు దగ్గర్లో ఉన్నప్పుడు మగ పురుగులు తమ హెయిర్ పెన్సిల్స్ నుంచి మిథైల్ సాలిసిటేట్ ను అధికంగా విడుదల చేస్తున్నట్లు గుర్తించారు.అపెండేజెస్ కమ్యూనికేషన్ కోసం కెమికల్ ను విడుదల చేసి ఆడ పురుగులను( Female Insects ) అట్రాక్ట్ చేస్తున్నట్లు గుర్తించారు.ఆడ పురుగులను ఆకర్షించేందుకు మగ పురుగులు ఒక్కోలా ప్రయత్నిస్తూ ఉంటాయని సైంటిస్టులు గుర్తించారు.
స్వయంగా ఈ పురుగులుకు ఇలా పర్ప్యూమ్ తయారుచేసుకునే శక్తి ఉందని ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదు.తొలిసారి శాస్త్రవేత్తలు గుర్తించడంతో ఈ విషయం ఇప్పుడు షాకింగ్ గా మారిందని చెప్పవచ్చు.