యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )పెళ్లి గురించి దాదాపు గా పదేళ్లు గా ప్రచారం జరుగుతోంది.మిర్చి సినిమా సమయంలోనే ప్రభాస్, అనుష్క( Anushka Shetty ) పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత బాహుబలి సినిమా( Baahubali ) తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు వచ్చాయి.ఇద్దరు కూడా తాము మంచి స్నేహితులం అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత ప్రభాస్ కి సంబంధాలు చూస్తున్నాం అంటూ కృష్ణం రాజు చాలా సార్లు మీడియా కు చెప్పాడు.ఆ తర్వాత కాలం లో ఆయన మరణించడం జరిగింది.
ఇప్పుడు మరో సారి ప్రభాస్ పెళ్లి వార్తలు జోరుగా వస్తున్నాయి.మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం 2024 లో ప్రభాస్ పెళ్లి జరుగబోతుంది.అందుకు గాను భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటికే అమ్మాయి ఫిక్స్ అయ్యిందని కూడా ఫ్యామిలీ వర్గాల్లో టాక్ వినిపిస్తుందట.ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల కారణంగా ఈ ఏడాది పెళ్లికి సమయం ఉండక పోవడం వల్ల వచ్చే ఏడాది లో పెళ్లికి సమయం ను ప్రభాస్ కేటాయించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ కొత్తగా వార్తలు వస్తున్నాయి.
గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.కనుక ఈసారి ప్రభాస్ పెళ్లి వార్తలు నిజం అయ్యి ఉంటాయి అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ప్రభాస్ ( Prabhas )తో పాటు మొన్నటి వరకు ఉన్న చాలా మంది బ్యాచిలర్స్ పెళ్లి పీటలు ఎక్కేశారు.
ఇప్పుడు ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయం వచ్చిందని చాలా మంది అంటున్నారు.కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి విషయం లో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.
మీడియా లో ఎప్పటికప్పుడు పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి.