యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్”( Salar ) ఒకటి.ఈ సినిమాపై మిగతా సినిమాల కంటే డబుల్ అంచనాలను ఫ్యాన్స్ పెట్టుకున్నారు.
ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతుంది.ఈ క్రమంలోనే వరుసగా ప్రమోషన్స్ కోసం సిద్ధం అవుతున్నారు.
ప్రమోషన్స్ తో అంచనాలు పీక్స్ కు తీసుకు వెళ్లి ఓపెనింగ్స్ మరిన్ని కొల్లగొట్టాలని మేకర్స్ ఆలోచన.
ఈ ఆలోచనను టీజర్ తోనే అమలు పరిచారు.ఈ మధ్యనే ఈ మూవీ నుండి టీజర్ వచ్చిన విషయం తెలిసిందే.ఈ టీజర్ కోసం ఎన్నో రోజులుగా డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూడగా ఎట్టకేలకు రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులను కూడా తిరగరాసి ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో పాన్ ఇండియా వైడ్ గా చూపించేసాడు.
ఇక ఈ టీజర్ ఫాస్టెస్ట్ 100 మిలియన్ టీజర్ల లిస్టులో కూడా నిలిచింది.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ నుండి టీజర్ రిలీజ్ చేసిన మూడు రోజుల్లోనే ట్రైలర్ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు.ఆగస్టులో ఈ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని టీజర్ వచ్చిన రెండు రోజులకే ప్రకటించి మరో సెన్సేషన్ క్రియేట్ చేసారు.ఇదిలా ఉండగా అతి త్వరలోనే సలార్ ఫస్ట్ సింగిల్ కూడా వస్తుంది అని తాజాగా బజ్ వైరల్ అవుతుంది.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్( Director Ravi Basrur ) అండ్ టీమ్ బిజీగా ఉన్నారని అతి త్వరలోనే ఈ సినిమా మ్యూజికల్ అప్డేట్ వస్తుందని టాక్.మరి మ్యూజిక్ ఏ రేంజ్ లో అలరిస్తుందో వేచి చూడాలి.
కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.