తెలుగు లో మల్టీ స్టారర్ కి పెరుగుతున్న డిమాండ్...

సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో అంటే ఇంకో హీరో కి పడదు అని అందరూ అనుకుంటారు కానీ ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి మారిపోయింది ఒక హీరో ఫంక్షన్ కి ఇంకో హీరో రావడం అనే విషయాన్ని పక్కన పెడితే స్టోరీ నచ్చితే వాళ్ల సేఫ్ జోన్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి మల్టీ స్టారర్ సినిమాలు( Multistarer Movies ) చేయడానికి కూడా హీరో లు ముందుకు వస్తున్నారు…ఇక ఈ విషయం లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముందు వరుసలో ఉంటాడు…

 Tollywood Makers To Remake Multistarer Movies Maanaadu And Vikram Vedha Details,-TeluguStop.com

అయితే ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా సూపర్ సక్సెస్ కావడం తో పెద్ద హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రెడీ గా ఉంటున్నారు…ఇక అందులో భాగంగానే తమిళం లో హిట్ అయిన మానాడు( Maanaadu ) కూడా మేకర్స్ రీమేక్ చేసే పనిలో ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక దాంతో పాటు గా ఒక ఇద్దరు పెద్ద హీరోలని పెట్టీ విక్రమ్ వేద సినిమాని( Vikram Vedha Movie ) కూడా రీమేక్ చేసే ఆలోచనలో టాలీవుడ్ ఉన్నట్టు గా తెలుస్తుంది…

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో( Tollywood ) అందరికి మంచి రోజులు వచ్చాయని అందుకే హీరోల్లో ఏ మాత్రం ఇగో లేకుండా చాలా బాగా కలిసిపోయి ఒకరి సినిమాకి మరొకరు సహాయం చేసుకుంటున్నారు…ఇక ఇలాంటి టైం లో మంచి కథలు దొరికితే సీనియర్ హీరోలు కూడా కలిసి నటించడానికి అసక్తి చూపిస్తున్నారు…ఇదంతా ఇండస్ట్రీ కి మంచి శకునం అని అందరూ అంటున్నారు…అయితే ఇప్పుడిప్పుడే హీరో ల మధ్య తీరు ని గమనిస్తున్న ఫ్యాన్స్ కూడా మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అనే మాటలతో తగువులడటం కూడా తగ్గిస్తున్నారు అందరూ మన హీరోలే అని అనుకునే స్టేజ్ కి ఫ్యాన్స్ వచ్చేశారు…

 Tollywood Makers To Remake Multistarer Movies Maanaadu And Vikram Vedha Details,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube