ఆండ్రాయిడ్ యూజర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన గూగుల్.. విషయమిదే?

అవును, మీకు తెలిసిందో లేదో గాని, ఆండ్రాయిడ్ యూజర్లను గూగుల్( Google ) హెచ్చరిస్తోంది.ఆండ్రాయిడ్ ఫోన్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని గట్టిగా చెబుతోంది.

 Google Gave A Strong Warning To Android Users What Is The Matter , Android Users-TeluguStop.com

ఆండ్రాయిడ్ డెవలపర్‌ అధికారిక ప్రకటనలో సర్వీసు ఫ్యూచర్ రిలీజ్‌లో దాదాపు పదేళ్ల కిందటి కిట్ కాట్ ఓయస్ సపోర్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.యాక్టివ్ డివైజ్ కౌంట్ క్షీణించడం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్టు టెక్ దిగ్గజం పేర్కొంది.

ఆగస్ట్ 2023 నుంచి సర్వీసుల్లో కిట్ కాట్ ఓయస్ అప్‌డేట్‌లను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.అవును, గూగుల్ పే సర్వీసుల భవిష్యత్తు రిలీజ్‌లో ఇకపై కిట్ కాట్ ఓయస్ కి సపోర్టు అందించడం లేదని ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి.

Telugu Android, Latest, Ups-Latest News - Telugu

2013లో రిలీజైన ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ( Android KitKat )బాగా పాపులర్ అయిన సంగతి అందరికీ తెల్సిందే.అయితే, సంవత్సరాలుగా టెక్నాలజీలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకోవడంతో కిట్ కాట్ ఓయస్ పాతది అయిందని, కొత్త టెక్నాలజీకి సంబంధించిన సెక్యూరిటీకి ఇకపై సపోర్టు ఇవ్వదని గూగుల్ పేర్కొంది.ఈ అప్‌డేట్‌లు లేకుండా ఓయస్ యూజర్లకు భద్రతా ప్రమాదాలకు కూడా హాని కలిగిస్తుంది.ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ప్లాట్‌ఫారమ్ మొదటిసారిగా 10 ఏళ్ల క్రితం లాంచ్ చేసిన విషయం అందరికీ విదితమే.

అప్పటి నుంచి ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అనేక వినూత్న మెరుగుదలలు, ఫీచర్లను KKలో అందుబాటులో లేవని సెర్చ్ దిగ్గజం పేర్కొంది.

Telugu Android, Latest, Ups-Latest News - Telugu

వినియోగదారులకు సురక్షితమైన ఎక్స్‌పీరియన్స్ అందించాలనే నెపంతోనే పాత వెర్షన్లకు సపోర్టును నిలిపివేస్తోంది గూగుల్.ఇప్పుడు కొత్త ఆఫర్ల భద్రత, కార్యాచరణను మెరుగుపరచడంపై కేంద్రీకరించాలని గూగుల్ ఆలోచిస్తోంది.గూగుల్ యూజర్లు తమ ఆండ్రాయిడ్ డివైజ్‌లను కొత్త వెర్షన్‌కి ప్రాధాన్యంగా ఆండ్రాయిడ్ 10 లేదా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11కి ( Android 11 )అప్‌గ్రేడ్ చేయమని సలహా ఇస్తోంది.

దానివలన సరైన పర్ఫార్మెన్స్ సెక్యూరిటీని పొందవచ్చు.అప్‌గ్రేడ్ చేయడం ద్వారా యూజర్లు లేటెస్ట్ ఫీచర్‌లు, బగ్ ఇష్యులను ఫిక్స్ చేయడమే కాకుండా, ఆండ్రాయిడ్ సర్వీసులను ఉపయోగించవచ్చన్నమాట.లేదంటే భద్రతా కారణాల దృష్ట్యా.పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లు, ఆన్‌లైన్‌లో సైబర్ దాడికి, ఇతర స్కామర్లకు మరింత హాని కలిగిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube