పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ బ్రో(Bro).పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగిన సంఘటన గురించి మరోసారి ప్రస్తావనకు తీసుకువచ్చారు.రెండు సంవత్సరాల క్రితం సాయి ధరంతేజ్ రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ ప్రమాదం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా కథకు సాయి ధరంతేజ్ నిజ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఈ సినిమా కథకు కమిట్ అవుతున్న సమయంలోనే తనకు ప్రమాదం జరిగిందని తెలిపారు.తాను త్రివిక్రమ్( Trivikram ) ఇంట్లో ఉండగా సాయి తేజ్ కు ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చింది వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాను చిన్న ప్రమాదమే కదా ఒక గంటలో బయటకు వస్తాడు అనుకున్నాను కానీ తాను మాత్రం బయటికి రాలేదు పెద్ద పెద్ద డాక్టర్లంతా లోపలికి వెళ్తున్నారు కానీ ఏమి చెప్పడం లేదు.
ఈ విధంగా సాయి తేజ్ పరిస్థితి చూసి నాలో ఒక నిస్సహాయత ఏర్పడింది.దీంతో ఒక మూలన కూర్చొని తన ఇష్ట దైవాన్ని ప్రార్థించాను వాడికి జీవితం చాలా ఉంది ఎలాగైనా వాడిని బ్రతికించు అని వేడుకున్నాను.సినిమాలలో లాగా గుడి గోపురాలకు వెళ్లి పూజ చేయలేను.
దీంతో నాలో నేనే చాలా ఏడ్చానని పవన్ తెలిపారు.సాయి తేజ్ ఇలా మన ముందు ఉన్నారంటే ముందుగా డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాలి.
అంతకంటే ముందుగా అతను రోడ్డుపై నిస్సహాయ స్థితిలో పడి ఉంటే తనని కాపాడినటువంటి అబ్దుల్ ఫర్హాన్ కు తాను ఎప్పుడు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.