ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో మీనాక్షి చౌదరి కూడా ఒకరు.ఇచ్చట వాహనములు నిలపరాదు, ఖిలాడీ, హిట్2 సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఈ బ్యూటీ గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాతో పాటు విశ్వక్ సేన్ కొత్త సినిమాలో సైతం నటిస్తున్నారు.
గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డేకు బదులుగా సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి ఎంపిక కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.మీనాక్షి, శ్రీలీల సిస్టర్స్ గా కనిపిస్తారని వీళ్లిద్దరి కాంబినేషన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది.
తాజాగా ఈ బ్యూటీ బోల్డ్ సీన్ల గురించి, ముద్దు సీన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.కెరీర్ తొలినాళ్లలోనే మంచి సినిమాలలో అవకాశాలు రావడం సంతోషంగా ఉందని మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) వెల్లడించారు.
నేను చాలా కథలు వింటున్నానని కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్స్ లో నటించాలని ఉందని మీనాక్షి చౌదరి అన్నారు.టాలీవుడ్ ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారని గొప్ప సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయంటే అది నిజంగా నాకు దక్కిన గౌరవమే అని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం తెలుగులో మూడు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నానని మీనాక్షి చౌదరి వెల్లడించారు.

ఇబ్బందిగా అనిపించే సన్నివేశాల్లో తాను నటించనని కథకు ఇంపార్టెంట్ అయితే ముద్దు సీన్లలో నటించడానికి మాత్రం సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు.అశ్లీల సన్నివేశాల్లో మాత్రం అస్సలు నటించనని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చారు.కొత్త పాత్రల్లో నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోననని ఆమె పేర్కొన్నారు.మీనాక్షి చౌదరి రెమ్యునరేషన్( Remuneration ) కూడా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.మీనాక్షి చౌదరి రాబోయే రోజుల్లో స్టార్ స్టేటస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







