మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.మునుపటి కంటే మరింత యాక్టివ్ గా ఉంటూ తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ఫిల్ చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్'( Game Changer ) సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.దీంతో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.ఇక చరణ్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన 16వ ప్రాజెక్ట్ ను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా( Director Buchi Babu )తో ప్రకటించాడు.
‘RC16’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామా( Sports Drama )గా తెరకెక్కనుంది అనే ప్రచారం జరుగుతుంది.ఈ ప్రాజెక్ట్ పై రామ్ చరణ్ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారట.
ఇప్పటికే రామ్ చరణ్ పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అంటూ ఈ సినిమా గురించి చెప్పి అందరిలో ఆసక్తి పెంచేశారు.దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్( Mega Fans ) రకరకాలుగా ఉహించు కుంటున్నారు.
ఇక ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలుస్తుంది.చరణ్ గేమ్ ఛేంజర్ నవంబర్ నాటికీ పూర్తి చేసి ఆ తర్వాత డిసెంబర్ నుండి ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నారని టాక్.రురల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.చూడాలి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.