బ్యాంకులతో( Banks ) ప్రతిఒక్కరికీ అవసరం ఉంటుంది.నగదు లావాదేవీల కోసం చాలామంది బ్యాంకులకు వెళుతూ ఉంటారు.
రోజువారీ అవసరాల కోసం డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్తూ ఉంటారు.ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ గురించి అవగాహన ఉన్నవారు లేదా ఏటీఎం వాడటం తెలిసినవారు బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండా నగదు లావాదేవీలు నిర్వహించుకుంటారు.
కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ గురించి అవగాహన లేని గ్రామాల్లో నివసించే ప్రజలు బ్యాంకులకు వెళ్లి నగదు లావాదేవీలు జరుపుతారు.
అయితే బ్యాంకులకు కూడా శనివారం, ఆదివారంతో పాటు పబ్లిక్ హాలీడేస్( Public Holidays )లో సెలువులు ఉంటాయి.ఈ సెలవులు గురించి కస్టమర్లు ముందుగానే తెలుసుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా పడవచ్చు.రోజువారీ కార్యాకలాపాలకు తమకు అవసరమయ్యే డబ్బులను ముందుగా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఆగస్టు( August month ) విషయానికొస్తే బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూతపడనున్నాయి.రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, పండుగలు కలుపుకుని 14 రోజులు సెలవులు ఉన్నాయి.
ఆగస్టు 6 ఆదివారం, ఆగస్టు 12 రెండో శనివారం, ఆగస్టు 13 ఆదివారం, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 20 ఆదివారం, ఆగస్టు 26 నాలుగో శనివారం, ఆగస్టు 27 ఆదివారం,ఆగస్టు 30 రక్షాబంధన్, ఆగస్టు 31 రక్షాబంధన్, శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.ఇక రాష్ట్రాలను బట్టి ఆగస్టు 8న సిక్కింలోని గ్యాంట్ టక్ లో, ఆగస్టు 16న పార్సీ పూతన సంవత్సరం సందర్భంగా ముంబై, లేలాపూర్లలో, ఆగస్టు 18న వ్రీమంత శంకర్ దేవ్ తిధి సందర్భంగా అస్సా గౌహతిలో, ఆగస్టు 28న మొదటి ఓనం, ఆగస్టు 29న తిరుఓణం సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.బ్యాంకులు మూతపడినా యూపీఐ( UPI ), నెట్ బ్యాంకింగ్ సేవలు యధాతధంగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.