ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మాటల్లో ప్రేమ చూపటం, చేతల్లో విషం చిమ్మటం జగన్ నైజం అని విమర్శించారు.
రాజధానిలో సెంటు పట్టా పేరుతో ఇళ్ల నిర్మాణం మోసగించడమేనని మండిపడ్డారు.సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా శంకుస్థాపన కార్యక్రమం చేశారన్నారు.పేదలపై సీఎం జగన్ కు ప్రేమ ఉంటే పోలవరం నిర్వాసితులకు ఎందుకు ఇళ్లు కట్టడం లేదని ప్రశ్నించారు.30 లక్షల ఇళ్లు కడతానని మూడు లక్షలు కూడా కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.జోగి రమేశ్ అసమర్ధ హౌసింగ్ మంత్రి అని ఆరోపించారు.