ప్రస్తుత కాలంలో తీసుకుంటున్న ఆహారం వల్ల 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు జీవించడమే కష్టమవుతోంది.90 సంవత్సరాలు జీవించడం అంటే కూడా అరుదైన రికార్డ్ అనే చెప్పాలి.అయితే ఒక వ్యక్తి మాత్రం 90 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు.వినడానికి ఆశ్చర్యంగా, విచిత్రంగా అనిపించినా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో హాట్ టాపిక్ అవుతోంది.
సౌదీ అరేబియా( Saudi arabia )కు చెందిన ఈ వృద్ధుడు 90 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకోవడం ద్వారా ఎక్కువ వయస్సు ఉన్న వరునిగా చెత్త రికార్డ్ ను ఖాతాలో వేసుకున్నారు.ప్రస్తుతం ఈ వృద్ధుడు ఐదో భార్యతో హనీమూన్ కు వెళ్లాడు.
అయితే విచిత్రం ఏంటంటే భవిష్యత్తులో మరిన్ని పెళ్లిళ్లు చేసుకుంటానని ఈ వృద్ధుడు చెబుతున్నాడు.పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యమని ఈ వృద్ధుడు వెల్లడించడం గమనార్హం.
ఈ వృద్ధుడి పేరు నాదిర్ బిన్ దహైమ్ వాహక్ అల్ ముర్షిదీ అల్ ఓతాబీ( Nasser bin Dahaim bin Wahq Al Murshidi Al Otaibi ) కాగా ఈ వృద్ధ వరునికి సంబంధించిన పెళ్లి వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.ఈ వృద్ధుడు మాట్లాడుతూ పెళ్లి జీవితం ఎంతో శక్తివంతమైనదని చెప్పుకొచ్చారు.పెళ్లి చేసుకోవడం వల్ల లైఫ్ లో ప్రశాంతత దొరుకుతుందని ఈ వృద్దుడు చెబుతున్నారు.తాను చేసుకున్న పెళ్లిళ్ల వల్లే దీర్ఘాయుష్షు దక్కిందని ఆయన అన్నారు.
కొంతమంది నెటిజన్లు మాత్రం ఆ వృద్ధుడిని తెగ ట్రోల్ చేస్తున్నారు.అమ్మాయిల జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారని ఆ వృద్ధుడిపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.90 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఏముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ముసలోడే కానీ మహానుభావుడు అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.