ఖలిస్తాన్ ( Khalistan )వేర్పాటువాదుల ఆగడాలు రోజురోజుకు పెచ్చమీరుతున్న నేపథ్యంలో భారత్-కెనడా( India-Canada ) సంబంధాలపై ప్రభావం పడుతోంది.ఖలిస్తాన్ వేర్పాటువాదులపై చర్యలు తీసుకోవాలని న్యూఢిల్లీ ఎన్నిసార్లు హెచ్చరించినా ట్రూడో ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు.
ఈ పరిణామాలు ఇరుదేశాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం వుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇలాంటి పరిస్ధితుల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం భారత్‌లో పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేయడంతో నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన జీ20 ఆర్ధిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కెనడా ఉప ప్రధాని , ఆర్ధిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ ( Chrystia Freeland )భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవడం దీనికి నిదర్శనం.
ఈ సమావేశం తర్వాత ఫ్రీలాండ్ ట్వీట్ చేశారు.భారత్-కెనడాల మధ్య ఆర్ధిక సహకారం, వాణిజ్యం, బహుపాక్షిక అభివృద్ధి, బ్యాంకుల సంస్కరణ, క్రిప్టో ఆస్తుల విధానంపై చర్చించామని తెలిపారు.అటు భారత్ – కెనడా మధ్య జరుగుతున్న పలు వాణిజ్య సంబంధిత చర్చల పురోగతిపై చర్చించామని భారత ఆర్ధిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
కెనడియన్ పెన్షన్ ఫండ్‌లు .భారతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా వున్నాయని ఆర్ధిక శాఖ పేర్కొంది.దీనికి కారణం భారత్‌లో స్ధిరమైన పెట్టుబడి వాతావరణం వుండటమేనని తెలిపింది.
గ్రేటర్ టొరంటో ఏరియా( Greater Toronto Area ) లేదా GTA ఖలిస్తాన్ రెఫరెండంపై ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు భారత్ – కెనడా ఆర్ధిక మంత్రుల మధ్య ఈ సమావేశం జరిగింది.సిక్కు వేర్పాటువాద సంస్థ ‘‘సిఖ్ ఫర్ జస్టిస్ ’’( Sikh for Justice ) (ఎస్ఎఫ్‌జే) ఆధ్వర్యంలో ఈ రెఫరెండం నిర్వహించింది.మిస్సిస్సాగాలోని జీటీఏ టౌన్‌లోని మాల్టన్ ప్రాంతంలోని గురుద్వారా శ్రీగురు సింగ్ సభలో దీనిని జరిపారు.
మరోవైపు ఇరుదేశాలు తమ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు కెనడాలో భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma ).ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన గురువారం మాట్లాడుతూ.భారత ప్రభుత్వం నిషేధించిన ఒక సంస్థ చట్టవిరుద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ఇరుదేశాల సంబంధాలను చెడగొట్టాలని చూస్తోందన్నారు.