గ్రీన్‌కార్డ్( green card )కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులకు ప్రయోజనం చేకూర్చేలా అమెరికాలో త్వరలో ప్రకటన వెలువడే అవకాశం వుంది.1992 నుంచి ఉద్యోగ వర్గాలకు వినియోగించబడని దాదాపు 2,30,000కు పైగా వున్న గ్రీన్‌కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే సిఫారస్సును ‘‘ఆసియా అమెరికన్లు, స్ధానిక హవాయి అండ్ పసిఫిక్ ద్వీపవాసులపై ఏర్పాటైన అమెరికా అధ్యక్షుడి సలహా సంఘం ఆమోదించింది.1992 నుంచి 2022 వరకు ఎవరికి మంజూరు చేయబడని 2,30,000కు వున్న ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్‌లను తిరిగి స్వాధీనం చేసుకుని వాటిని ప్రాసెస్ చేయాలని ఆసియా అమెరికన్లు, హవాయి అండ్ పసిఫిక్ ద్వీపవాసులపై బైడెన్( Joe Biden ) సలహా కమీషన్ సభ్యుడు అజయ్ భూటోరియా .కమీషన్‌కు సమర్పించిన నివేదికలో కోరారు.దీని వల్ల గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియలో బ్యూరోక్రాటిక్ జాప్యాలు పరిష్కారం కావడంతో పాటు బ్యాక్‌లాగ్‌లలో వేచివున్న వ్యక్తులకు ఉపశమనం లభిస్తుందన్నారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఏడాదికి నిర్ధిష్ట సంఖ్యలో కుటుంబ ఆధారిత, ఉపాధి ఆధారిత వలస వీసాలను జారీ చేసేందుకు యూఎస్ కాంగ్రెస్( United States Congress ) ద్వారా అధికారం పొందింది.అయితే బ్యూరోక్రాటిక్ జాప్యం కారణంగా గ్రీన్‌కార్డ్‌లు మంజూరు చేయడం తక్కువగా వుంది.దీంతో ఇన్నేళ్లుగా ఉపయోగించని గ్రీన్‌కార్డులు పేరుకుపోతున్నాయి.
దీనిని పరిష్కరించేందుకే అజయ్ భూటోరియా రెండు పరిష్కారాలను ప్రతిపాదించారు.వ్యక్తులు , కుటుంబాలు, యూఎస్ ఆర్ధిక వ్యవస్థపై ఉపయోగించని గ్రీన్‌కార్డ్‌ల ప్రతికూల ప్రభావాన్ని తన సిఫారసు నొక్కిచెబుతుందని ఆయన పేర్కొన్నారు.
ఉపయోగించని గ్రీన్‌కార్డ్‌లు దేశం కోసం కోల్పోయిన అవకాశాలను సూచిస్తాయన్నారు.ముఖ్యంగా భారతీయ – అమెరికన్, ఫిలిపనో -అమెరికన్, చైనీస్ – అమెరికన్ కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భూటోరియా ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రీన్ కార్డ్ లేకపోవడం హెచ్ 1 బీ వీసాలపై తాత్కాలిక ఉద్యోగుల కదలికను పరిమితం చేస్తుందన్నారు.యూఎస్ ఆర్ధిక వ్యవస్థకు వారి సహకారాన్ని కూడా పరిమితం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తాత్కాలిక ఉద్యోగుల పిల్లలు 21 ఏళ్లు వచ్చేసరికి ఇమ్మిగ్రేషన్ స్థితి నుంచి అమెరికాలో వుండకూడని స్థితికి చేరుకుంటారని భూటోరియా పేర్కొన్నారు.
పరిపాలనాపరమైన లోపాల కారణంగా గతంలో యూఎస్‌సీఐఎస్ జారీ చేయని గ్రీన్‌కార్డ్‌లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు 117వ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలతో తన సిఫారసుకు పోలిక వుందని భూటోరియా( Ajay Jain Bhutoria ) తెలిపారు.కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ప్రకారం.గడిచిన రెండు దశాబ్ధాలుగా ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డ్‌ల కోసం వెయిటింగ్ లిస్ట్‌లో వున్న వారి సంఖ్య 100 శాతానికి పైగా పెరిగింది.2020 నాటికి కుటుంబం ప్రాయోజిత గ్రీన్‌కార్డ్‌ల కోసం సగటున ఆరు సంవత్సరాల నిరీక్షణ సమయంతో దాదాపు 4.2 లక్షల మంది వ్యక్తులు వేచి వున్నారు.కానీ భారతీయ ఐటీ నిపుణులకు దాదాపు 15 ఏళ్లు గడిచినా వారికి గ్రీన్‌కార్డ్ దక్కడం లేదు.దీనికి అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న కంట్రీ క్యాప్ పరిమితే కారణం.