చిరంజీవి సినిమాలలో అలా ఉంటే సినిమా హిట్... రిపీట్ అవుతున్న సెంటిమెంట్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు దర్శక నిర్మాతలకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి.ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నప్పుడు వారు ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ తమ సినిమాలను సక్సెస్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.

 If Chiranjeevi's Movies Are Like That The Movie Will Be A Hit ,chiranjeevi , Soc-TeluguStop.com

ఈ క్రమంలోనే కొందరు సినిమా టైటిల్ మొదటి అక్షరం సెంటిమెంట్ ఉండగా మరి కొందరు సినిమా టైటిల్ విషయంలో కూడా సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు.అలాగే మరికొందరు సినిమా ప్రారంభం తేదీని విడుదల తేదీని కూడా చాలా సెంటిమెంట్ గా భావించి విడుదల చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) సినిమాల విషయంలో కూడా గత కొద్దిరోజులు ఒక సెంటిమెంట్ రిపీట్ అవుతుందని తెలుస్తుంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, God, Ravi Teja, Sathya Dev, Sushanth, Tollywo

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోని ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత నటించే సినిమాలు అన్నింటిలో కూడా తనతో పాటు మరొక యంగ్ హీరోని కూడా బాగా చేస్తూ వస్తున్నారు.చిరంజీవి సినిమాలలో మరొక యంగ్ హీరో నటించగా ఆ సినిమాలు హిట్ అవుతున్నాయని సెంటిమెంట్ గా భావించి చిరు సినిమాలలో యంగ్ హీరోల( Young Heroes ) కు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, God, Ravi Teja, Sathya Dev, Sushanth, Tollywo

తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్( God Father ) సినిమాలో చిరంజీవితో పాటు సత్యదేవ్ ( Sathya Dev ) నటించిన సంగతి తెలిసిందే.అలాగే వాల్తేరు వీరయ్య( Valtheru Verayya ) సినిమాలో రవితేజ ( Ravi Teja ) భాగమయ్యారు.ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమాలో కూడా ఏం హీరో సుశాంత్ ( Sushanth ) బాగమయ్యారు.ఈ సినిమా కూడా హిట్ అవుతుందన్న ధీమాతో మెగా అభిమానులు ఉన్నారు.

ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు.ఈ సినిమాలో కూడ సిద్దు జొన్నలగడ్డ ( Siddu Jonnalagadda ) నటించబోతున్నారని తెలుస్తుంది.

అలాగే బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రాబోయే సినిమాలో కూడా మరొక యంగ్ హీరోకి ఛాన్స్ ఇవ్వబోతున్నారంటూ చిరంజీవి సినిమాల సెంటిమెంట్ గురించి ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube