ప్రతి వారం లాగే ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సినిమాలు రెడీగా ఉన్నాయి.ఈ వారం దాదాపు 10 సినిమాలు థియేటర్‌లో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే… నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, షైన్ టామ్ చాకో తదితరులు ప్రధానోపాత్రలో నటించిన రంగబలి సినిమా ఈనెల 7వ తేదీన విడుదల కానుంది.ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి దర్శకత్వం వహించారు.
శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి, వైవా హర్ష, రాజీవ్ కనకాల, జాన్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన భాగ్ సాలే సినిమా ఈనెల ఏడవ తేదిన విడుదల కానుంది.అలాగే జగపతిబాబు,మమతా మోహన్‌దాస్, విమలారామన్, ఆశిష్ గాంధీ తదితరులు ముఖ్యపాత్రలో నటించిన రుద్రంగి సినిమా 7వ తేదీ విడుదల కానుంది.
అజయ్ సామ్రాట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇద్దరు సినిమా(Iddaru Movie ) ఈ నెల ఏడవ తేదీన విడుదల కానుంది.ఎస్ఎస్ సమీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్, జేడీ చక్రవర్తి, సోనీ చరిష్ట, కె.విశ్వనాథ్, సమీర్ తదితరులు నటించారు.అదేవిధంగా సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనాయ్, నైనా తదితరులు ముఖ్య పాత్రలో నటించిన సర్కిల్ సినిమా ఏడో తేదీ విడుదల కానుంది.ఓ సాథియా సినిమా కూడా ఈనెల 7వ తేదీన విడుదల కానుంది.
ఇందులో ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.సింగలూరి మోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన మోహన్‌కృష్ణ గ్యాంగ్‌లీడర్ సినిమాలో మోహన్‌కృష్ణ, సౌజన్య, హరిణిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
<img src="https://telugustop.com/wp-content/uploads/2023/07/july-first-week-rangabali-Insidious-The-Red-Door-Iddaru-Movie-arjun-hollywood.jpg “/>
ఈ సినిమా కూడా 7 వ తేదీ విడుదల కానుంది.7.11PM సినిమా కూడా ఏడవ తేదీ విడుదల కానుంది.ఇందులో సాహస్,దీపికా ప్రధాన పాత్ల్లో నటించారు.
అదేవిధంగా సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలో నటించిన నాతో నేను సినిమా కూడా ఈ నెల ఏడవ తేదీన విడుదల కానుంది.అలాగే ఇన్సీడియస్: ది రెడ్ డోర్ మూవీ( Insidious: The Red Door ) జులై 6న విడుదల కానుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు వెబ్‌సిరీస్‌ల విషయానికి వస్తే. ది పోప్స్ ఎగ్జార్సిస్ట్ (T he Pope Exorcist )అనే హాలీవుడ్ మూవీ జులై 7న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
డీప్ పేక్ లవ్ రియాల్టీ షో కూడా జులై 7న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.ఇకపోతే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యే సినిమాల విషయానికి వస్తే.
బాబీలోన్ హాలీవుడ్ మూవీ జులై 5న విడుదల కానుంది.అలాగే స్వీట్ కారం కాఫీ జులై 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.